పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/100

ఈ పుట ఆమోదించబడ్డది

76

భారత దేశమున


కము, పెద్దజీతముగల ప్రతి పదవియు వారి కంద కుండజేసితిమి. వారిని మనము చాలా క్రిందినౌకరీలలో మాత్రమే యుండనిచ్చుచున్నాము. వారికి జీవనమునకు చాలీ చాలని జీత మిచ్చుచున్నాము. ఈ చిన్న యుద్యోగములు గూడా తెల్లవారెవ్వరును దానికి తగరు గనుకనే విధిలేక భారతీయుల చేతులలో నుంచినాము. వీ రెల్లరను తక్కువజాతి వారినిగా మనము చూచుచున్నాము. భారతీయప్రభుత్వమే యున్నచో ప్రభుత్వములో గొప్ప యుద్యోగములు చేయగలవారిని, మన మాటంకపరుపనిచో రాష్ట్ర గవర్నరులుగ నుండగలవారిని, నీచ సేవకులకన్నను కనిష్టముగా జూచుచున్నాము. వీరిని హైన్యస్థితికి దింపి వీరు పెద్ద యుద్యోగములకు తగరని నిందించుచున్నాము. కేవలము దేశశాంతిస్థాపనకొరకు మాత్రమే యుపయోగించి ప్రజలలో నెవ్వరు నెట్టి అధికారమునకు గూడ తగనట్లుగా జేసి అణచియుంచుట కేనా ఎంతో గొప్పదని మనము గర్వపడు "శాసనధర్మములును చట్టవిధులు నుపయోగించుట? ఈ భారతీయప్రజల కింతదుస్థితి దాపురింపజేసిన మన కెంతమాత్రము శ్రేయస్కరముగాని ఈవిధానమునుమార్చి ఉదార విధానముల నవలంబించుట యుక్తము. బ్రిటిషుప్రభుత్వమువారియొక్క ఉద్దేశము తమ ప్రజల శీలమును బాగుపరచుటయే. విశ్వాసము అధికారముగల పదవులందు ఈ ప్రజలను ప్రవేశపెట్టి వీరిని ముందుగా మనము గౌరవించిన తప్ప వీరిని బాగుపరచుట సంభవింపదు." అని సర్ తామస్‌మన్రో పలికియున్నాడు. (Life and Experiences-Sir P. C. Ray P. 226, 227)