పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

సభ్యులు:- 13. సమృద్ధి కలుగునుగాక! పుష్టికలుగునుగాక! తుష్టి కలుగునుగాక! వృద్ధికలుగునుగాక! అవిఘ్నము కలుగునుగాక! ఆయుస్సుకలుగునుగాక! ఆరోగ్యముకలుగునుగాక! కార్యములందు మంగళమగునుగాక! సత్కర్మసమృద్ధి కలుగునుగాక! కీడుతొలగునుగాక! ఏదిపాపమోయదిప్రతిహతమగునుగాక! ఏదిశ్రేయస్సో యదియగునుగాక!

వరణము

కన్యాదాత:- 14. ఇదిగోఅర్ఘ్యము. ప్రతిగ్రహింపుము.

వరుడు:- 15. అర్ఘ్యమును ప్రతిగ్రహించు చున్నాను.

కన్యాదాత:- 16. ఇదిగోవస్త్రము. ప్రతిగ్రహింపుము.

వరుడు:- 17. వస్త్రమును ప్రతిగ్రహించుచున్నాను.

కన్యాదాత:- 18. ఇదిగోఉంగరము. ప్రతిగ్రహింపుము.

వరుడు:- 19. ఉంగరమును ప్రతిగ్రహించు చున్నాను.


13. ఓం, ఋధ్యతాం! శాంతిరస్తు! పుష్టిరస్తు! తుష్టిరస్తు! వృద్ధిరస్తు! అవిఘ్నమస్తు! ఆయుష్యమస్తు! ఆరోగ్యమస్తు! శివం కర్మాస్తు! సత్కర్మ సమృద్ధిరస్తు! ధర్మసమృద్ధిరస్తు! అరిష్టనిరసనమస్తు! యత్పాపంతత్ప్రతి హతురస్తు! యచ్ఛ్రేయస్తదస్తు!

14. ఓం, ఇద మర్ఘ్యం ప్రతిగృహ్యతాం.

15. అర్ఘ్యం ప్రతిగృహ్నామి.

16. ఓం, ఏషపరిచ్ఛదం ప్రతిగృహ్యతాం.

17. పరిచ్ఛదం ప్రతిగృహ్నామి

18. ఓం, అంగుళీయం ప్రతిగృహ్యతాం.

19. అంగుళీయం ప్రతిగృహ్నామి.