పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

స్వస్తి పుణ్యాహవచనాదికము.

కన్యాప్రదాత:- 7. ఆకాశమునందు వ్యాపించిన పదార్థములను నేత్రము చూచునట్లే జ్ఞానులు సర్వవ్యాపకు డైనపరమేశ్వరుని పరమపదమును సదాచూచుచున్నారు.

8. కుటుంబసహితముగా మహాజనులకు నమస్కారముచేసి, యాశీర్వచన మపేక్షించు చున్ననాకు చేయబోవు చున్న వివాహకార్యమునందు మీరు శుభము పలుకుదురుగాక!

సభ్యులు:- 9. ఆయుష్మంతుడ వైననీకుశుభము (అగునుగాక!).

కన్యాప్రదాత:- 10. చేయ బోవుచున్న వివాహ కార్యమునందు మీరు పుణ్యాహము పలుకుదురుగాక!

సభ్యులు:- 11. పుణ్యాహ మగునుగాక!

కన్యాప్రదాత:- 12. చేయబోవు చున్న వివాహ కార్యమునందు మీరు సమృద్ధిని పలుకుదురుగాక!


7. ఓం, తద్విష్ణో: పరమపదం సదా పశ్యంతి సూరయ: దివీన చక్షు రాతతం-

8. మహ్యం సహకుటుంబాయ మహాజనాన్న మస్కూర్వాణాయ ఆశీర్వచన మపేక్షమాణాయ కరిష్యమాణ వాహకర్మణి స్వస్తీతిభవంతో బ్రువంతు!

9. ఓం, ఆయుష్మతే స్వస్తి!

10. కరిష్యమాణవివాహకర్మణి పుణ్యాహం భవంతో బ్రువంతు!

11. ఓం, పుణ్యాహం!

12. కరిష్యమాణ వివాహకర్మణి ఋద్ధిం భవంతో బ్రువంతు!