పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/7

ఈ పుట ఆమోదించబడ్డది

4. ఎవ్వ డొక్కడో, వర్ణరహితుడో, శక్తియోగమువలన ప్రయోజనమును దెలిసి బహువిధములుగా ననేకవర్ణముల నిచ్చుచున్నాడో, అంతమందును ఆదియందును విశ్వమును వ్యాపించి యున్నాడో, ఆదేవుడు మనకు మంచిబుద్ధిని సమకూర్చును గాక!

5. ఎవరిహృదయమునందు మంగళాకరుడును పావనంహరుడును నైన భగవంతు డుండునో వారికెప్పుడును ఏకార్యమునందును అమంగళ ముండదు.

6. సర్వలోకేశ్వరునకు నమస్కారము; పరమేశ్వరునకు నమస్కారము; సర్వశుభప్రదాయకునకు నమస్కారము; విఘ్ననివారకునకు నమస్కారము; శ్రీపరబ్రహ్మమునకు నమస్కారము.


        4. య ఏకోవర్ణో బహుథా శక్తియోగాత్
           వర్ణా ననేకాన్ని హితార్థో దథాతి
           విచైతి చాంతే విశ్వ మాదౌ సదేవ:
           ననోబుధ్యా శుభయా నంయునక్తు.

        5. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషా మమంగళం
           ఏషాంహృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి:.-

        6. సర్వజగదీశ్వరాయ నమ: పరమేశ్వరాయ నమ: సర్వమంగళ
           ప్రదాయకాయ నమ:, విఘ్న నివారకాయ నమ:, శ్రీపరబ్రహ్మణే నమ:.