పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మవివాహవిధానము --:0:--

భగవత్స్మరణము.

౧. అగ్నియందును, జలమునందును, ఓషధులయందును, వృక్షములయందును, సమస్తలోకమునందును, ఏదేవుఁడు వ్యాపించి యున్నాడో ఆదేవునకు నమస్కారము; నమస్కారము

౨. ప్రాణము, మనస్సు, సర్వేంద్రియములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, సమస్తమును ధరించెడుభూమి, ఈతనివలన పుట్టుచున్నవి.

౩.ఈతనిభయమువలన అగ్ని వేఁడిమినిచ్చుచున్నది; సూర్యుఁడు వేఁడిమి నిచ్చుచున్నాఁడు; మేఘుఁడును వాయువును ఐదవదియైన మృత్యువును పరుగిడుచున్నవి.


        ౧. యోదేవోగ్నౌ యోప్సు యోవిశ్వంభువన మావివేశ
           యఓష్ధీషు యోవనస్పతిషు తస్మైదేవాయ నమోనమః -

        ౨. ఏతస్మాజ్జాయతే ప్రాణో మనస్సర్వేంద్రియాణిచ
           ఖం వాయుర్జ్యోతిరఅపః పృథివీ విశ్వస్యధారిణీ -

        ౩. భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః
           భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః -