పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/23

ఈ పుటను అచ్చుదిద్దలేదు

డవు కమ్ము. ఏప్రకారముగా నిన్ను కాపాడుకొనుటకును ఉన్నతి నొందించు కొనుటకును యత్నము చేయుదువో, ఆప్రకారముగానే నీభార్యను సహితము పవిత్రమైన ధర్మపథమునందు ఉన్నతిని పొందించుటకు యత్నించువాడము కమ్ము. ఈమె సత్యసుఖమార్గమునందు చిరకాలము నీసఖివలె చరించులాగున ఉపదేశము చేతను దృష్టాంతము చేతను నిత్యమును సత్కార్యము యందును గృహకృత్యముల యందును నిరతురాలినిగా దిద్దుము.

3. (వధువును గూర్చి) శ్రీమతి -- దేవీ! దేనిచేత నీభర్తకు మంగళములు కలుగునో దానిని నీవు మనోవాక్కాయముల చేత నాచరింప వలయును. నీవు భర్తయం దేకాగ్ర మనస్సుతో నుండుము. నీమేలు ---- యుపదేశించునో దానిని నీవు పాలింపవలయును. నీవు పతియే ప్రాణముగా గలదానవును సదాచారవును కమ్ము. అపరమితవ్యయము కాని యెవరితోను కలయము గాని యొనర్ప కుండుము.


భవిష్యసి తధా