పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

పవిత్రసన్నిథానమునందు వివాహ శృంఖలముచేత మీరు కట్టబడినారు. ఇప్పటివఱకును స్వసుఖోన్నతిని మాత్రమే మనస్సులో నుంచుకొనియే కాకిజీవనమార్గమున సంచరించితిరి. ఇప్పుడు వివాహసంబంధ జనితమైన గురుతరభారము మీ హస్తమునందు పెట్టబడినది. ఇప్పుడు మీకు సంసారముయొక్క మొదటిమెట్టుమీద కాలుమోపితిరి. అవధానముతో ముందుకు నడుచువారగుదురుగాక! దీనిమార్గము అతిదుర్గమములు; దీనియాశలగుంపులు అపరిమితములుగా నున్నవి. ఎప్పుడును సంసారికమోహజాలముచేత చుట్టబడినవారు కాకుండులాగున హెచ్చరిక గలవారగుదురుగాక! సాంసారికసుఖసంపత్తికొఱకు సర్వసుఖదాత యైన పరమేశ్వరుని మఱువకుందురుగాక! సత్యస్వరూపునియందు సంపూర్ణవిశ్వాస ముంచి యొండొరుల యున్నతిసాధనము కొఱకును సుఖవర్ధనము కొఱకును యత్నించు చుండువా రగుదురుగాక!


ఏ కాకీజీవనపధే వ్యచరత్. అధునా వివాహసంబంధజనిత: గురుతరభార: యువయోర్హస్తే స్యస్త:. అద్య యువాం సంసారస్య ప్రథమసోపానే పాదం నిక్షిపధ. అవథానేవ అగ్రసరౌ భవేతాం. అస్యవంథాన: అతిదుర్గమా:. అస్య ప్రలోభనరాశయ: అపరిమితా న్సన్తి. అవహితౌ భవేతం యత్ కదాచన సాంసారికమోహజాలే నావృతౌ మా భూతమ్. సాంసారిక సుఖసంపత్యై సర్వసుఖదాతారం పరమేశ్వరం నవిస్మ రేతాం. సత్యస్వరూపే సంపూర్ణవిశ్వాసం కృత్వా పరస్పరస్య ఉన్నతిసాధనాయ సుఖవర్ధనాయచ