పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

2. బలలాభముకొఱకు రెండవయడుగును పెట్టుము. ఇట్లు నన్ననుసరించు దానవుకమ్ము.

3. నియమపాలనము కొఱకు మూడవ యడుగును పెట్టుము. ఇట్లు నన్ననుసరించు దానవుకమ్ము.

4. సుఖలాభముకొఱకు నాల్గవ యడుగును పెట్టుము. ఇట్లు నన్ననుసరించు దానవుకమ్ము.

5. సంతానలాభముకొఱకు ఐదవయడుగును పెట్టుము. ఇట్లు నన్ననుసరించు దానవుకమ్ము.

6. సంపల్లాభముకొఱకు ఆఱవయడుగును పెట్టుము. ఇట్లు నన్ననుసరించు దానవుకమ్ము.

7. ఏడవయడుగును పెట్టి నాకు సఖురాలవు కమ్ము. నేను నీసఖ్యమును పొందుచున్నాను.

ఆచార్యోపదేశము.

50 - 1. (వధూవరులనుగూర్చి) ఇప్పుడు మంగళస్వరూపుడును కరుణామయుడును నైనపరమేశ్వరునియొక్క (ప్రసాదమువలన నాతని


2. ఓం. ఊర్జే ద్విపదీ భవ. సామా మనువ్రతాభవ.

3. ఓం. వ్రతాయ త్రిపదీ భవ, సామా మనువ్రతాభవ.

4. ఓం. మయోభవాయచతుష్పదీభవ. సామా మనువ్రతాభవ.

5. ఓం. ప్రజాభ్య: పంచవదీభవ. సామా మనువ్రతాభవ.

6. ఓం. రాయస్యోషాయషట్పదీభవ. సామా మనువ్రతాభవ.

7. ఓం. సఖా సప్తపదీ భవ. అహం తవసఖ్యం లభే.

____________

41 - 1. అద్య మంగళస్వరూపస్య కరుణామయస్య పరమేశ్వరస్య ప్రసాదాత్ తన్యపవిత్రే సన్నిధానేవివాహశృంఖలేన యువా మాబద్ధౌ. అద్యావధిస్వ స్యైవ సుఖోన్నతిం మనసినిథాయ