పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

వరుడు:- 47. నీవు నాసఖురాలవు కమ్ము. నేను నీకు సఖుడ నయ్యెదను. మనసఖ్య మెప్పుడును భంగము నొందకుండునుగాక!

వధువు:- 48. నీవు నాసఖుడవుకమ్ము. నేను నీకు సఖురాలనయ్యెదను. మనసఖ్య మెప్పుడును భంగము నొందకుండునుగాక!

ప్రార్థన.

వధూవరులు:- 49. ఓయీశ్వరా! ఈప్రతిజ్ఞలను పరిపాలించుటయందు మాకు సహాయుడవు కమ్ము.

సప్తపది.

[ఒక్కొక్క పాదము వెట్టునప్పుడు భర్త యొక్కొక యుపదేశము చేయవలెను.]

వరుడు:- 1. ఈశ్వరలాభముకొఱకు మొదటియడుగును పెట్టుము. ఇట్లు నన్ననుసరించుదానవుకమ్ము.


         47. నఖీభవ త్వం నను తే భవామి
             సఖా, ప్రభిద్యేత నసఖ్య మావయో:

         48. సఖాభవత్వం నను తే భవామి
             సఖీ, ప్రభిద్యేత న సఖ్య మావయో:

         49. రక్షణోస్యా: ప్రతిజ్ఞాయా: సహాయోభవమేప్రభో.

వరుడు:- 1. ఓం. ఈశే ఏకవదీ భవ. సా మా మనువ్రతా భవ.