పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

వరుడు:- 43. సంపదయందును ఆపదయందును సుఖమునందును దు:ఖమునందును ఆరోగ్యమునందును రోగమునందును నీక్షేమసంపాదనమునందు యత్నించువాడ నయ్యెదను.

వధువు:- 44. సంపదయందును ఆపదయందును సుఖమునందును దు:ఖమునందును ఆరోగ్యమునందును రోగము నందును నీక్షేమసంపాదనమునందు యత్నించుదాన నయ్యెదను.

వరుడు:- 45. నాయొక్క యీహృదయము నీహృదయ మగునుగాక! నీయొక్క యీహృదయము నాహృదయమగునుగాక! ఈప్రకారముగా కూర్పబడిన మన హృదయములు పరమేశ్వరుని వగునుగాక!

వధువు:- 46. నాయొక్క యీహృదయము నీహృదయమగునుగాక! నీయొక్క యీహృదయము నాహృదయమగును గాక! ఈప్రకారముగా కూర్పబడిన మనహృదయములు పరమేశ్వరుని వగునుగాక!


        43. సంపది విపది, సుఖేదు:ఖ, సుస్థతాయా మసుస్థతా
            యాంచ, తవమంగళసాధనే యత్నవా నస్మి.

        44. సంపది, విపది, సుఖేదు:ఖ, సుస్థతాయా మసుస్థతా
            యాంచ తవమంగళసాధనే యత్నవత్యస్మి.

        45. ఓం. యదేతత్ హృదయంమమతదస్తుహృదయంతవ;
            యదేతత్ హృదయంతవ తదస్తుహృదయంమమ;
            యఏతే హృదయేనౌస్తా ముభయో రీశ్వరస్యతే.

        46. ఓం. యదేతత్ హృదయంమమ తదస్తుహృదయంతవ;
            యదేతత్ హృదయంతవ తదస్తుహృదయంమమ;
            యఏతే హృదయే నౌస్తాముభయో రీశ్వరస్యతే.