పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

మంగళసూత్రధారణము.

39. ఓసౌభాగ్యవతీ! నాప్రేమచిహ్నముగా ఈమంగళ సూత్రమును నీకు కంఠమునందు కట్టుచున్నాను. నాతోడగూడ ధర్మమార్గమున చరింపుము.

వివాహబంధము.

(వధూవరుల బట్టకొనలు ముడివైచినమీదట.)

40. సత్యగ్రంధిచేత మనస్సును హృదయమును నీకు బంధించుచున్నాను. నాయొక్క యీహృదయము నీహృదయమగునుగాక! నీయొక్క యీహృదయము నాహృదయమగునుగాక! ఈప్రకారముగా కూర్పబడిన మనహృదయములు పరమేశ్వరునివగునుగాక!

41. పవిత్రుడైన పరమేశ్వరుడు సాక్షిగా శ్రీమతివైన - అనునిన్ను నేను ఇప్పుడు ధర్మపత్నినిగా స్వీకరించుచున్నాను.

42. పవిత్రుడైన పరమేశ్వరుడు సాక్షిగా శ్రీయుతుడవైన - అను నిన్ను నేనిప్పుడు ధర్మపతినిగా స్వీకరించుచున్నాను.


39. మాంగళ్యతంతు మేతం తేమమప్రేమనిబంధనమ్
    కంఠే బధ్నామి సుభగే ధర్మంచర మయా సహ.

40. ఓం. బధ్నామిసత్యగ్రంధినామసశ్చహృదయంచ తే.
    ఓం. యదేతత్ హృదయం మమతదస్తుహృదయంతప;
    యదేతత్ హృదయంతవ తదస్తు హృదయంమమ.
    య ఏతే హృదయే నౌ స్తాముభయోరీవ్శ్వరస్యతే.

41. పవిత్రపరమేశ్వరస్యసాక్షి త్వేన శ్రీమతీమముకీం...
    త్వా మహం అద్య ధర్మపత్నీత్వేన స్వీకరోమి.

42. పవిత్రపరమేశ్వరస్యసాక్షిత్వేన శ్రీమంత మముకం
    త్వా మహ మద్య ధర్మపతిత్వేన స్వీకరోమి.