పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

35. ఈకన్య ధర్మార్థకామసిద్ధికొఱకు విద్యావంతుడవైన నీకు నాచే నియ్యబడినది. ధర్మమునందును అర్థమునందును భోగమునందును నీ వీమె నతిక్రమించి చరింప గూడదు.

36. అతిక్రమించి చరింపగల వాడనుకాను.

పాణిగ్రహణము.

37. (తనచేతితో వధువుచేయిపట్టుకొని) నేను సౌభాగ్యము కొఱకు నీహస్తమును గ్రహించుచున్నాను. ఆలాగున నీవు యావజ్జీవమును నాతోడ గూడ నుందువుగాక!

38. ప్రేమ ప్రేమనిచ్చెను. ప్రేమ దాత, ప్రేమ ప్రతి గృహీత, ప్రేమచేతనిన్నుప్రతిగ్రహించుచున్నాను. ధర్మసిద్ధికొఱకును సుఖసిద్ధికొఱకును కన్యవైన నిన్ను ప్రతిగ్రహించుచున్నాను.


35. తుభ్యం విద్వన్ మయాదత్తాధర్మ కామార్థసిద్ధయే ధర్మేచార్థేచ కామేచ నాతిచరితవ్యాత్వయేయమ్.

36. నాతిచరిష్యామి.

37. ఓం, గృహ్నామి తే సౌభగత్వాయ హస్తం మయాపత్యా జరదష్టిర్యధాస:

38. ప్రేమాప్రేమ్ణోదాత్. ప్రేమాదాతా, ప్రేమా ప్రతిగృహీతా; ప్రేమ్ణా త్వాం ప్రతిగృహ్ణామి.