పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

కన్యాదానము.

32. సద్గుణ సంపన్నురాలును స్వర్ణాభరణభూషితురాలును నగు కన్యను ఉభయుల హితమును గోరి విద్యావంతుడ వగునీ కిచ్చు చున్నాను.

33. విశ్వంభరుడును సర్వశక్తుడును నగు ప్రభువీకర్మయందు సాక్షియయియుండగా ధర్మాభివృద్ధికొఱకు ఈకన్యను నీకు దానము చేయుచున్నాను.

34. ఇప్పుడు, ఈ -- సంవత్సరమున, ఈ -- మాసమునందు, సూర్యుడు ఈ -- రాశియందుండగా, ఈ - పక్షమందు, ఈ - తిథియందు, ఈ - వారమున, ఈ - గోత్రముగల యీశ్వరప్రీతికాముండైననేను, ఈ - గోత్రమును - ప్రవరయుగల యీతని - ప్రపౌత్రుడును, ఈ - గోత్రమును - ప్రవరయుగల యీతని - పౌత్రుడును,


32. కన్యాం సద్గుణసంపన్నాం కనకాభరణై ర్యుతాం విద్వన్ తుభ్యంప్రదాస్యామి ఉభయోర్హితకామ్యయా.

33. విశ్వంభర స్సర్వశక్తి: సాక్ష్యస్మిన్ కర్మణిప్రభు: ఇమాంకన్యాంప్రదాస్యామితుభ్యంధర్మనివృద్ధయే.

34. అద్య, అముకే సంవత్సరే, అముకే - మాసి, అముకే - రాశిస్థే భాస్కరే, అముక - పక్షే, అముక - తిథౌ, అముక - వాసరే, అముక - గోత్ర: శ్రీఅముక:- ఈశ్వరప్రీతికామో అహం, అముక - గోత్రస్య, అముక - ప్రవరస్య, అముకస్య - ప్రపౌత్రాయ, అముక - గోత్రస్య, అముక - ప్రవరస్య, అముకస్య - పౌత్రాయ,