పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

30. మేము నిన్ను స్మరించెదము; మేము నిన్ను భజించెదము; జగత్సాక్షితూపుడవగు నీకు నమస్కరించెదము; సత్స్వరూపుడవును అద్వితీయుడవును ఆదికారణుడవును నిరాలంబుడవును ఈశ్వరుడవును పాపసముద్రమున కోడవును అగు నిన్ను శరణొందు చున్నాము.

31. అనత్తునుండి మమ్ము నత్తును పొందింపుము; అంధకారమునుండి మమ్ము తేజస్సును పొందింపుము మృత్యువునుండి మమ్ము అమృతత్త్వమును పొందింపుము; ఓస్వప్రకాశుడా! మాకు నీప్రకాశమును ప్రకటింపుము; ఓపరమేశ్వరా! నీకరుణాముఖముచే మమ్ము సర్వదా కాపాడుము.


30. వయంత్వాంస్మరామో వయంత్వాంభజామో వయంత్వాం జగత్సాక్షిరూపం నమామ: నదేకం నిదానం నిరాలంబ మీశం భవాంభోధిపోతం శరణ్యం ప్రజామ:

31. అనతో మానద్గమయ తమసో మాజ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ అవిరావీర్మ ఏధి రుద్ర యత్తేదక్షిణం ముఖం తేన మాంపాహినిత్యమ్.