పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

27. సత్స్వరూపుడవును జగత్కారణుడవును అగు నీకు నమస్కారము; జ్ఞానస్వరూపుడవును సర్వలోకాశ్రయుడవును అగు నీకు నమస్కారము; అద్వైతతత్వమవును ముక్తిదాయకుడవును అగు నీకు నమస్కారము; సర్వవ్యాపియు శాశ్వతుడును అగు బ్రహ్మమునకు నమస్కారము.

28. నీవొక్కడవే శరణ్యుడవు; నీవొక్కడవేవరేణ్యుడవు; నీవొక్కడవే జగత్పాలకుడవు స్వప్రకాశుడవు; నీవొక్కడవే జగత్కర్తవు రక్షకుడవు సంహర్తవు; నీవొక్కడవే సర్వశ్రేష్ఠుడవు నిశ్చలుడవు నిర్వికల్పుడవు.

29. నీవు భయములకు భయంకరుడవు; భీషణములకు భీషణుడవు; ప్రాణులకు గతిపి; పావనులకు పావనుడవు; మహోన్నతపదములకు నియామకుడవు; నీవొక్కడవే శ్రేష్ఠులకు శ్రేష్ఠుడవు; రక్షకులకు రక్షకుడవు.


27. నమస్తే సతే తే జగత్కారణాయ నమస్తే చితే సర్వలోకాశ్రయాయ నమోద్వైతతత్వాయ ముక్తిప్రదాయ నమోబ్రహ్మణే వ్యాపినే శాశ్వతాయ.

28. త్వమేకం శరణ్యం త్వమేకం వరేణ్యం త్వమేకం జగత్పాలకం స్వప్రకాశం త్వమేకం జగత్కర్తృ పాతృప్రహర్తృత్వమేకంపరం నిశ్చలంనిర్వికల్పమ్.

29. భయానాం భయం భీషణం భీషణానాం గతి: ప్రాణినాం పావనం పావనానాం మహోచ్చై:పదానాం నియన్తృ త్వమేకం పరేషాపరం రక్షణం రక్షణానాం.