పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

పరస్పరాంగీకారము

ఆచార్యుడు:- 22. శ్రీమాన్ - ఆర్య! శ్రీమతియీ - దేవిని పత్నినిగా గ్రహించుటకు నీవు కృతసంకల్పుఁడ వయినావా?

వరుడు:- 23. అయినాను.

ఆచార్యుడు:- 24. శ్రీమతి - దేవీ! శ్రీమాన్ - ఆర్యుని పతినిగా గ్రహించుటకునీవు కృతసంకల్పురాలవయినావా?

వధువు:- 25. అయినాను.

ఈశ్వరోపాసనము

26. బ్రహ్మము సత్యస్వరూపమైనది. జ్ఞానాత్మకమైనది, అంతములేనిది, ఆనందస్వరూపమైనది, శాంతమైనది, మంగళస్వరూపమైనది, అద్వితీయమైనది, పరిశుద్ధమైనది, పరహితమైనది.


22. శ్రీమన్ ----ఆర్య! కింత్వమేతాం శ్రీమతీ మముకీం - దేవీమ్ పత్నీ త్వేన గ్రహీతుం కృత సకల్ప:?

23. ఓం. కృతసంకల్పోస్మి.

24. శ్రీమత్యముకీ - దేవీ! కింత్వమిమం శ్రీమంత మముకం - ఆర్యం పతిత్వేన గ్రహీతుం కృతసంకల్పా?

25. ఓం - కృతసంకల్పాస్మి.

26. సత్యం జ్ఞానమనస్తంబ్రహ్మఆనందరూప మమృతం యద్విభాతి శాంతం శివ మద్వైతం శుద్ధ మపావ విద్ధమ్.