పుట:బ్రహ్మ వివాహ విధానము - కందుకూరి వీరేశలింగం-1909-28.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

కన్యాదాత:- 20. బ్రహ్మము సత్యము. ఇప్పుడు, ఈ - మాసమునందు, సూర్యుడు ఈ - రాశియందుండగా, ఈ - పక్షమునందు, ఈ - తిథియందు, ఈ - వాసరమున, ఈ - గోత్రమును -- ప్రవరయునుగల యీతని - మునిమనుమరాలును, ఈ -- గోత్రమును -- ప్రవరయుగలయీతని -- మనుమరాలును, ఈ - గోత్రమును -- ప్రవరయుగల యీతని -- కొమారితయు, ఈ -- గోత్రమును -- ప్రవరయు గలశ్రీ - దేవియనుకన్యను శుభ బ్రాహ్మవివాహము చేత దానముచేయుటకై యీ యర్ఘ్యాదులచేత నర్చించి భద్రుడవైన నిన్ను వరునిగా వరించు చున్నాను.

వరుడు:- 20. నేను వరింప బడినవాడ నైతిని.


20. ఓం తత్సత్.

అద్య, అముకే -- మాసి, అముక -- రాశిస్థే భాస్కరే, అముక - పక్షే, అముక - తిథౌ, అముక -- వాసరే, అముక -- గోత్రస్య అముక -- ప్రవరస్య అముకస్య -- ప్రపౌత్రీం, అముక - గోత్రస్య అముక ప్రవరస్య అముకస్య -- పౌత్రీం, అముక -- గోత్రస్య అముక -- ప్రవరస్య అముకస్య -- పుత్రీం, అముక - గోత్రాం అముక -- ప్రవరా శ్రీ అముకీం - దేవీంకన్యాం శుభబ్రాహ్మవివాహేన దాతుం ఏభిరర్ఘ్యాదిభి రభ్యర్చ్య వరత్వేన భవం తం భట్టం వృణే.

21. ఓం, వృతోస్మి.