పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/52

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

45


గద్య.

ఇది శ్రీమద్రామభద్రకరుణాకటాక్షవీక్షణసమాలబ్ధ
గీర్వాణాంధ్రభాషాకవిత్వకళాధురంధర బడగలనాటికన్నడ
వంశపయఃపారావారరాకాసుధాకర ఆశ్వలాయనసూత్ర
భారద్వాజసగోత్ర శ్రీధరమల్లె అయ్యనార్యతనయ సూరిజన
విధేయ వేంకటరామనామధేయబ్రణీతంబయిన బ్రహ్మోత్తర
ఖండంబను మహాపురాణంబునం దిష్టదేవతాప్రార్థనంబును
వంశానుచరితంబును సూతమునీంద్రసంవాదంబును గాశికా
నగరవర్ణనంబును దూర్వాసాగమనంబును గళావతీవివాహం
బును దాశార్హభూపాలునకు గర్గమహామునీంద్రుండు పంచా
క్షరీమంత్రం బుపదేశించుటయుఁ బంచాక్షరప్రభావంబును
ననుకథలు గల ప్రథమాశ్వాసము.