పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/3

ఈ పుట ఆమోదించబడ్డది

4

పీఠిక

ఈబ్రహ్మోత్తరఖండమును శ్రీపట్టమెట్ట సోమనాథ సోమయాజి, శ్రీముత్తరాజు వేంకటకృష్ణకవి, ప్రాఁతకోట మల్లయకవి అను వీరు మువ్వురును బద్యరూపముననే తెలిఁగించియున్నారు. ఇవి అముద్రితములు. ఈవేంకటరామకవి కవిత్వము పురాణశైలిని నాతికఠినముగను సరసముగను నున్నది. దీని పూర్వముద్రణము పెక్కుతప్పులతోను, లోపములతోను నిండియున్నది. దీని ఆంధ్రసాహిత్యపరిషత్తునంగల తాళపత్రమాతృకలతో సరిచూచి లోపములు పూరించి కూడినంతవఱకుఁ దప్పులు దిద్దించి చక్క జేసితిని.

తండయార్పేట,

ఇట్లు,

చెన్నపట్నము.

1901

వావిళ్ల వేంకటేశ్వరులు.