పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

17


క.

సారంగదనుజనాయక
సారంగమృగేంద్రునకును సజ్జనపటలీ
సారంగవారిధరునకు
సారంగకరాగ్రునకును సర్వజ్ఞునకున్.

69


క.

హాలాహలభక్షణునకుఁ
గైలాసనివాసునకును గాలాత్మునకుం
గాలమదధ్వంసునకును
ఫాలాక్షున కభవునకును బరమాత్మునకున్.

70


క.

ఉక్షేంద్రవాహునకు సం
రక్షితబాణునకు రాజరాజాప్తునకున్
కుక్షిస్థితభువనునకును
దక్షాధ్వరహరున కమితతాపఘ్నునకున్.

71


క.

అంబరకచునకు గజచ
ర్మాంబరధారునకు సచ్చిదానందునకున్
శంబరధరశేఖరునకు
నంబాపురవాసునకు మహాదేవునకున్.

72


వ.

అంకితంబుగా నారచియింపంబూనిన బ్రహ్మోత్తరఖండం
బనుమహాపురాణంబునకుఁ గథాప్రారంభం బెట్టిదనిన.

73