పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

9


సొరిది రాఘవనరసింహసోదరుండు
ధరణిఁ బొగడొందు వేంకటనరసఘనుఁడు.

33


తే.

అతఁడు నిజసాధ్వియైన లక్ష్మాంబయందుఁ
గాంచె నరసమ్మ యనఁగ వెంకమ్మ యనఁగఁ
బరఁగు నిద్దఱు దుహితల భద్రమతుల
మఱియుఁ జిక్కప్పయను సత్కుమారమణిని.

34


శా.

ఆచిక్కప్ప మహాప్రధానమణి వేదాంతార్థవిజ్ఞాతమే
ధాచక్రీశుఁడు రాజయోగసుకళాధౌరేయుఁ డాత్మైక్యని
ష్ఠాచాతుర్యపరుండు సద్గురుకటాక్షావాప్తిధీరుండునై
భూచక్రంబునఁ బేరుగాంచి వెలసెన్‌ బూర్ణప్రయోగాఢ్యుఁడై.

35


వ.

అంత.

36


క.

ఘనుఁ డాసుబ్బన్న జగ
ద్వినుతుఁడు రామాయణంబు వేంకటనరసిం
హునిపుత్త్రి యైననరస
మ్మను బరిణయమయ్యె హరి రమాసతిపగిదిన్.

37


సీ.

అతిథిసత్కారంబు లాచరించెడివేళ
           నన్నపూర్ణకు నుద్ది యనఁగవచ్చు
నతిశయభోగంబు లనుభవించెడిపట్ల
           శ్రీదేవికిని సాటి చెప్పవచ్చు
సతతక్షమాగుణసంపత్సమృద్ధిచే
           భూదేవికిని సరిపోల్పవచ్చుఁ
బరమపాతివ్రత్యభవ్యశీలంబుల
           నయ్యరుంధతికి జో డనఁగవచ్చు