పుట:బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది
వారాయన కంటికి కనపడకుండ దాగుకున్నారు - ఆది 3,8
దేవుడు నరుణ్ణి శిక్షింపకముందే పాపం దుష్ఫలితాన్ని ఈయనే ఇచ్చింది. నరునికి దేవునితోగల బాంధవ్యం తెలిపోయింది. అంతకుముందు ఆదామేవలిద్దరూ దిసమొల తోనే వుండువాళ్ళు. దిసమొలతోనే దేవునిచుట్టూ తిరిగేవాళ్ళు. కాని పాపం కట్టుకున్న వెంటనే ఆదామేవలను మొండిమొలతో వున్నామని తెలిసిపోయింది. ఇక వాళ్ళకు దే ఉవనితో నడవడనికి సిగ్గు వేసింది. భయం కలిగిందికూడ. కనుకనే దేవుని యెదుట బడలేక చెట్లనడుమ దాగుకున్నారు - 2,8-10.
ఆ పండు తింటే మీకు కనువిప్పు కలుగుతుంది అంది సర్పం. - 3,5. నిజమే. వాళ్లకు కనువిప్పు కలిగింది. కాని ఆదామేవలు కండ్లువిప్పి చూచుకునేప్పటికల్లా మన గొప్ప తనాన్నికాదు, దిసమొలను మాత్రమే గుర్తింప గలిగారు? వాళ్ళు తమ అల్పత్వాన్ని తెలిసికున్నారు. అవమానంతో క్రుంగిపోయారు. దేవుడు ఆదిమానవులను శపించాడు. మరణమూ, వనబహిష్కారము ఆశాప ఫలితాలే - 3,23. ఆనాటినుండి నరుడు దేవునికి దూరమయ్యాడు. ఈలాగే మనలను గూడ పాపం దేవుని నుండి దూరంచేస్తుంది.

5.మట్టినుండి పుట్టావు కనుక మట్టైపోతావు

పాపమే చేయకపోయినట్లయితే ఆదామునకు చావంటూ వుండేదికాదు. పాపఫలితం గా అతనికి మరణమనే శిక్ష సంక్రమించింది. కాని యేమ్మరణం? శారీరక మరణమా,ఆ త్మ మరణమా? రెండూ అని చెప్పాలి. అనగా ఆదాము భౌతికంగా చనిపోయాడు. ఆ మీదటే దైవ సాన్నిధ్యాన్ని కూడ కోల్పోయాడు.
జ్ఞానగ్రంథకర్త ఆదాము పాపాన్ని స్మరించుకొంటూ దేవుడు నరుణ్ణి అక్షయుడుగా వుండడంకోసం సృజించాడు. కాని పిశాచం అనూయవలన మరణం లోకంలోనికి ప్రవే శించింది అని వ్రాసాడు - జ్ఞాన 2,24. ఇక్కడ అక్షయుడుగా వుండడవంటే చని పోకయుండ వుండడమే, శాశ్వ తంగా దై వ సాన్నిధ్యాన్నిఅనుభవించడం గూడ. పాపం వలన ఆదాము ఈరెండుడ భాగ్యాలనూ కోల్పోయాడు.
పౌలు కూడ పై ఆదికాండనూ, జ్ఞానగ్రంథాన్ని మనసులో పెట్టుకొనే వో మనుష్యుని ద్వారా పాపమూ పాపం ద్వారా మరణమూ లోకంలోనికి ప్రవేశించాయ" అని వ్రాసాడు - రోమా 5,12. ఇక్కడ మరణమనగా భౌతిక మరణమూ, ఆ మీదటశాశ్వతమైన ఆత్మ మరణమూను. తరువాత పునీత అగస్తీను పై వేదావాక్యాలమీద వ్యాఖ్య వ్రాస్తూ దేవుడు ఆదామునకు ఏమామరణం విధించాడని ప్రశ్న వేసికొని దేహమరణం, ఆత్మమరణం రెండూనని జవాబిచ్చాడు. అనగా శాశ్వతంగా జీవింపవలసిన ఆదాము దైవ కృపకోల్పో యాడు గనుక యిక మరణిస్తాబు. మరణించిన పిదప దైవసాన్నిధ్యాన్నీ, దైవదర్శనాన్ని పొందలేదు. ఆదాము పొందిన యీ శిక్షనే పాపం చేసినప్పుడెల్లా మనమూ పొందుతుంటాం. .

3