పుట:బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు.pdf/3

ఈ పుట ఆమోదించబడ్డది

కాని ఇక్కడ మంచిచడ్డలు తెలిసికోవడమంటే యేమిటి? ఆదామేవలు తమ మంచిచెడ్డ లేమిటో తామే స్వయంగా గోరారు. ఇక వాళ్ళకు దేవునితో సంబంధం వుండకూడదు. తాము స్వతంత్ర ప్రాణులు గావాలనీ, దేవునిమీద ఆధారపడకుండ వుండాలనీ భావిం చుకున్నారు. అసలు వాళ్ళు దేవుడంత వాళ్ళు కావాలని, దేవునిలా వుండలనీ కోరు కున్నారు. ఇలా దేవునికి సరిసమానులు కావాలని కోరుకోవడమే వాళ్ళ పాపంలోని ప్రధానాంశం

ఇక, దేవుని తల్యులు కావాలని కోరుకోవడంలో ఉద్దేశమేమిటి? దేవుని అధికారాన్ని ధిక్కరించడం. దేవునికి లొంగి ఉండడం చేత గాని తన మనీ, అవమానకరమనీ భావిచడం. ఆదిదంపతులు తమ చిన్నరాకాన్ని విస్మరించి దేవునిముందు తమ పెదారికాన్ని చాటు కోవడం. అతడు సృష్టికర్తయనీ, తాము కేవలం సృజించిన ప్రాణులనీ మరచిపోవడం.

కావున కేవలం పండు తిన్నందుగాదాు ఆదామేవలు పతనమైపోయింది. సృష్టిప్రాణులై యుండికూడ సృష్టికర్తతో సమానంగా వుండలని కోరుకున్నందుకు.వాళ్ళ పాపం విశేషంగా గర్వంతో గూడింది. మనలోని గర్వ భావాన్ని గూడ అణచుకునే ప్రయనం చేద్దాం, ప్రార్థిద్దాం.

3. దేవుడు మీరు చనిపోతారని చెప్పినమాట నిజంకాదు - ఆది 3,4

నేను తినవదానిన పండు తిన్నారో, మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు- 3,3. కాని దేవుడుమాట నిజంకాదాు. మీరు చనిపోరు అంది పామె. వెంటనే యేవకు అనుమానం కలిగింది. అమ్మో ఈ దేవుడెంత మోసగాడు అనుకుంది! తనలాగు మేమూ మంచిచెడలు నిర్ణయించుకొని స్వతంత్రంగా జీవిస్తామని అసూయపడి దేవుడు ఆ చెట్టు పండు తినవద్దన్నాడు కాబోలు అని భావించింది. మేము అతనితో పోటీపడతామని తెలుసుకొని మ్ము అణగద్రొక్కడానికే ఈ ప్రయత్న మంతా చేసాడు అనుకుంది.

ఇకకడ యేవ దేవుణ్ణి తమలాంటి నురుణ్ణిగానే భావించుకుంది. తన కుటిలబుద్ధిని ఆయనకీ ఆరోపించింది. కాన ఆమె అపోహ నిజంకాదు. నరుడు దేవునిమీదా ఆధారపడతాడుగాని, దేవుడు నరునిమీదా ఆధారపడడు. అతడు సర్వ శక్తిమంతుడు కావడంచేత, ఇచ్చేవాడేగాని నరునినుండి పుచ్చుకునేవాడు కాఉడ.అందు చేత దేవుడు ఆదామేవలను గూర్చి అసూయపడడు . పడవలసిన అవసరంలేదు. వాళ్ళను వృద్ధిలోనికి తీసికొని రావాలనేదే అతని కోరిక.

ఈలా యేవ పాము మాటలు విని దేవుణ్ణి అపార్థం చేసికుంది. అతనికి దుష్టత్వాన్ని ఆరోపించింది. ఈ యారోపణ ద్వారా దుష్టత్వాన్ని వెల్లడి చేసుకుంది. ఈదుష్టాలోచనమే ఆదామేవల పాపంలోని ఘోరాంశం. మన హృదాయంలోని కుటిలభవాలను తలంచుకొనిగూడ పశ్చాత్తాప పడదాం.

2