పుట:బేతాళపంచవింశతి.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యే వసుమతీశు కూఁతురు
భావింపఁగ భామ యగుశుభస్థితి నాకున్.

105


వ.

అనిన చిలుక రాజకుమారునిం జూచి మగధేశ్వరుండైన చంద్రావలోకుండ
ను రాజు కూఁతురు చంద్రప్రభ యనుకన్యక నీకుం బత్ని యగునని చెప్పిన
విని మనోభవాయత్తచిత్తుండై.

106


క.

ఆ మగధేశ్వరతనయుం
డా మగధేశ్వరతనూజ ననిశము నాత్మన్
బ్రేమమునఁ దలఁపుచుండెను
గామునిసంకల్పనిహతిఁ గడునిజ మరయన్.

107


క.

ఆ మగధకన్యకకును
సోమిక యనుపెంటిచిలుక సుఖమధురవచో
ద్దామంబు గలదు ప్రియసఖి
యై ముద మొదవించు బహుకళాగమవిధులన్.

108


వ.

ఒక్కనాఁ డక్కన్నియయును నాకుం బురుషుం డెవ్వం డగునని
యచ్చిలుక నడిగినఁ బరాక్రమకేసరి యనురాజకుమారుండు నీ
కుం బ్రియుం డగునని చెప్పిన విని సంతసించి యతనిఁ దలంచు
చు మనోనుతాపిత యగుచుండె నంతఁ గాలక్రమంబున విక్రమకే
సరి తనకొడుకునకు నీకూఁతు నిమ్మని మగధేశ్వరు నడుగఁ బం
పిన దైవయోగంబున సంబంధబాంధవంబు నందిం
చిన నానందవిభవం బెసంగ సకలమనోహరంబు వర్తించునంతం
బరాక్రమకేసరి చంద్రప్రభాసహితుండై రోహిణీసహితుండైన