పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/191

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

బారిష్టరు పార్వతీశం

తుడిచిందన్న మాటే కాని, ఎక్కడా దుమ్మేలేదు. మన ఊళ్ళలో అయితే రోజుకు మూడుమూట్లు తుడిచినా కావలసినంత దుమ్ము. ఎక్కడ నుంచి వస్తోందో తెలియదు. తరువాత ఇంకొక పది నిమిషాలలో మేము ఏమీ చెప్పకుండానే మాకుభయులకూ ఫలహారాలూ, టీలు తెచ్చి యిచ్చింది. మేము ఆ కార్యక్రమం ముగించుకొని వీధిలో కెళ్ళే దుస్తులు ధరించి బైటకొచ్చాం. వచ్చేటప్పుడు తలుపులు దగ్గరగా వేసే వచ్చాడు. రాజు వీధిలోకొచ్చిన తర్వాత నెమ్మదిగా రాజు నడిగాను “తలుపు తాళం వెయ్యకుండా వస్తున్నావే” అని.

“ఏం ఫరవాలేదు. ఇక్కడ తలుపు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు. ఇంటి వాళ్ళమీద మనకు నమ్మకం లేదనీ వాళ్ళని అగౌరవ పరుస్తున్నామనీ ఇక్కడ వాళ్ళనుకుంటారు. అందుచేత ఎప్పుడూ తాళం వేయనక్కర్లేదు. ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకూ నోటికేగాని గదికి అవసరంలేదు.”

10

ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం. యెక్కే గుమ్మం దిగే గుమ్మం “టు లెట్” అని బోర్డు కట్టిన వాళ్లు కూడా మమ్మల్ని చూచి ఖాళీ లేవండి, వెరీసారీ! చాలా విచారిస్తున్నాను. అనేవారు. ఏ యింటికి వెళ్ళినా తలుపుతీసేవాళ్లు పలకరించేవాళ్లు, సమాధానాలు చెప్పేవాళ్ళూ, ఆడవాళ్ళే. అప్పటికప్పుడే మగవాళ్లు బైటికి వెళ్లుంటారు కాబోలు. అనుకున్నాను. కొన్ని చోట్ల గది మరీ చిన్నదిగానూ, యిరుకుగానూ వుండడం చేత నచ్చలేదు, కొన్ని చోట్ల ఇల్లు, ఇల్లాలూ కూడా చాలా అసహ్యంగా వుండి అక్కడనిలవబుద్ధిపుట్టలేదు. ఒకటి రెండుచోట్ల అంతా బాగున్నా అద్దె చాలా యెక్కువన్నాడు రాజు. ఇలా ఒంటిగంటవరకూ తిరిగి తిరిగి కాళ్లు బరువు లెక్కిపోయి, అడుగుతీసి అడుగు పెట్టలేనిస్థితిలో భోజనం వేళకు యింటికి చేరుకున్నాం. గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అది గ్రహించి మీరేం మొహమాటపడకండి, తొందరపడకండి, ఈ వేళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపుకాకపోతే ఎల్లుండి దొరకుతుంది? వారం రోజులదాకా మీరు నాతో వుండవచ్చు. “మీకీబ్బందేమోనని సందేహిస్తున్నాను తప్ప మరేం లేదు”. “నాకేమీ యిబ్బందిలేదు. మీకు యింకో మంచము లేకపోవడం ఒక్కటే “లోటన్నాడు” రాజు “మరేం ఫరవాలేదు లెండి,