పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/372

ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

165

నమరెడు నిత్యలింగార్చనవేళ - సముచితనైవేద్య సమయంబునందు
మెఱవడియై సురె వెఱికి ప్రాణమున - కొఱగోసినట్టుల యొకదెసఁజేర్చి
జంగమలింగావసరము సెల్లించు - భంగిగాఁదనప్రాణ లింగంబునకును
బళ్లెరమున నెల్లపదపదార్థములు - పెల్లుగా వడ్డించి వేరువేరునను
నరుదొందఁగడిగడి కందిచ్చుచుండఁ - గరమర్థితోఁగడిగడి కందుకొనుచు
భక్తవత్సలుఁడగు పరమేశ్వరుండు - వ్యక్తిగాఁజేసేత నారగించుడును
ముప్ప్రొద్దుఁబ్రాణలింగప్రసాదంబు - సుప్రసన్నత జంగమప్రసాదంబు
గూడ భోగించుచు [1]రూఢి వెంపార - వేడుకఁజౌడయ్య విహరించుచుండ
“హరునకు నిత్యంబుఁగరికాలచోడ - నరపతి [2]యారోగణము నెమ్మిఁజలుపఁ
బలకలనేఱినప్రాసంగుఁబ్రాలు - నలవడ మున్నూఁటయఱువదివుట్లు
ననయంబుఁ బత్రశాకాదులలోని - కననేల ముప్పందు మట మిరియాలు
నారగింపనె కాని యప్పదార్థముల - పేరీశ్వరుఁడెఱుంగ నేరఁ”డనంగఁ
గమియంగఁ బదపదార్థములు వడ్డించి - నమర సాయుధుఁడయి యవల నిల్చుండ
నప్పటి కప్పటి కాస్వాదనములఁ - జప్పుడు వినఁబడ నెప్పుడు శివుఁడు
ననురాగలీల నెక్కొన నారగించె - ననఁగ విందుము దొల్లి యదియునుగాక
మాదరచెన్నయ్య మహనీయకీర్తి - యాదట మదిఁదులుకాడఁ దొల్నాటి
యంబకళంబు జిహ్వాగ్రంబు వళ్లె - రంబుగాఁ దన కర్పితం బాచరింప
శివుఁడారగించెఁబ్రసిద్ధిగా నండు - రవిరళప్రీతి మైనట్లు వెండియును
వీరచోడవ్వ దాక్షారామమందు - నారగింపఁగఁజవియైనఁగంపించెఁ
గుడుకతోడన మఱి గడి యెత్త నోడి - తడయక పులగంబు దాసిచేఁబనుపఁ
“బుత్తెంచె మాయక్క వులగంబు నీకుఁ - జిత్తజాంతక! యిదే చేకొను” మనినఁ
బ్రీతిమైఁజయిసాఁచి భీమేశుఁడతివ - చేతిపులగముఁజెచ్చెరఁబుచ్చికొనుచు
నారోగణముసేసి యందఱుఁజూడఁ - గోరఁగ్రంగన వైచె గుడివెలి ననఁగ
వినఁబడె మఱియును మును గథలందుఁ - గనుఁగొనఁబడియె నేఁడనురాగలీలఁ
గటకానఁజౌడయ్యగారిచేఁగళ్లు - నిటలాక్షుఁడారగించుట నిప్పు” డనుచు
నఖిలభక్తావళి యంతఁగీర్తింప - సుఖలీల నుండె నా సురియచౌడయ్య
సురియ చౌడయగారి చరితంబు వినినఁ - గరమర్థిఁ జదివిన గారవించినను

  1. రూఢి
  2. యారోగిణము