పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/355

ఈ పుట ఆమోదించబడ్డది

148

బసవపురాణము

కిన్నర బ్రహ్మయ్య! గీర్వాణవంద్య! - కన్నుల గానని కష్ట లోకులము
అజ్ఞానజీవుల మపగతమతుల - మజ్ఞుల మధికసర్వాపరాధులము
కడసన్న నీదు విఖ్యాపితమహిమ - కడ యెఱింగెద మనఁగా మాతరంబె?
నీ యాజ్ఞఁదలమోచి నిటలలోచనుఁడు - 'నో'యనెఁబిలిచిన 'హే'యన్న నుడిగె
నింతటిలోన నీరేడులోకములు - సంతాపవర్తన సమసుస్తిఁబొందె
[1]నిప్పుడు గరుణింప నిట్లుల్లసిల్లెఁ - జెప్పఁ జిత్రము గాదె యెప్పాటనైనఁ
బరగంగ నిహలోకపరలోకములకు - హరుఁడవు నీవ శంకరుఁడవు నీవ
భవుఁడవు నీవ సద్భక్తుండ వీవ - భువిలోన మఱి సెప్పఁబోల్పంగఁగలరె?
నిద్దంబుగా నీట నద్దుము పాల - నద్దుము మాకింక నన్యధా లేదు
ఒక్క మాకేల, బ్రహ్మోక్తజీవులకు - నిక్కంబు దెస దిక్కు నీవ కావెట్లు
కావున, మముఁగటాక్షప్రేక్షణమున - భావింపవే కృపాభావం బెలర్ప”
ననుచు మఱియు మ్రొక్కియభినుతిసేయఁ - గనుఁగొని దరహాసకలితాస్యుఁడగుచుఁ
“గఱకంఠుభక్తుల కఱగొఱ లేక - వెఱచి బ్రదుకు వొమ్ము వేయునునేల?”
నని మును విశిరస్కుఁడైన మానవుని - జనులెల్లరు నెఱుంగ సప్రాణుఁజేసి
చనియెఁగిన్నరబ్రహ్మ శరణుండు భక్త - జనులును బసవఁడు ననురాగమంద
'నిశ్చయం బీతఁడే నిటలాక్షుఁ'డనుచు - నాశ్చర్యహృదయుఁడై యరిగె బిజ్జలుఁడు
అంత నట్టులు గిన్నరయ్య సద్భక్తి - కాంతుఁడై త్రిభువన [2]ఖ్యాతిమై నుండెఁ
బసరింపఁగిన్నరబ్రహ్మయ్యచరిత - మసలారఁజదివిన నర్థమై విన్న
భక్తియు సకలవిరక్తియు సహజ - భుక్తియు నభిమతభోగము ల్గలుగు

కలకేత బ్రహ్మయ్య కథ


మఱి, కలకేత బ్రహ్మయనాఁగ నొక్క - నెఱవాది భక్తుండు నిర్మలకీర్తి
జంగమవిశ్వాసి లింగాభిమాని - ([3]సంగతచరితుఁడభంగప్రతాపి
నిర్మూలితోభయ కర్మసంచయుఁడు - భర్మలోష్ఠైక సద్భావగోచరుఁడు
మహిత జీవన్ముక్తి మానసవర్తి - సహజలింగైక్యనిష్ఠాసమన్వితుఁడు
లోకైకనుతుఁడు దృణీకృతలోకుఁ - డేకాంగవీరుఁడపాకృత కర్మి
శుద్ధలింగాత్మ ప్రసిద్ధానుభవుఁడు - సిద్ధమహాద్భుత శీలుండు నాఁగఁ)

  1. నప్పుడ... నట్లుల్ల
  2. ఖ్యాతుఁడై యుం
  3. సంగతశుద్ధ ప్రసాదానుభవుఁడు - స్థైర్యసంపన్నుండు శౌర్యపండితుఁడు - ధైర్యప్రపూర్ణుండవార్యవీర్యుండు - సత్యవచోరాశిశరణాగ్రగణ్యుఁ - డత్యుత్తమోత్తముఁడనభువిఁదనరి - ఇట్లు రెండుమాతృకలందుఁ గలదు.