పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/301

ఈ పుట ఆమోదించబడ్డది

94

బసవపురాణము

యొకవువ్వువిరవాది యొకవువ్వుమల్లె - యొకవువ్వుసేవంతి యొకవువ్వుగోఁగు
నొకవువ్వుగరవీర మొకవువ్వుగలువ - యొకవువ్వుదామర యొకవువ్వుమొల్ల
యొకవువ్వుగోరంట యొవువ్వుజాజి - యొకవువ్వుసెంగల్వ యొకవువ్వుమొగలి
యొకవండుసహకార మొకవండునిమ్మ - యొకవండు[1]నారింజి యొక్కవండరఁటి
యొకవండు[2]నేరేడు నొకవండు[3]వెలఁగ - యొకవండుఖర్జూర మొక్కవండీడ
యొకవండుదాడిమం బొకవండు[4]మోవి - యొకవండుగంగరే గొకవండువనస
వ్యాపించి మొదలొక్కటై [5]యిట్లుగూడ - రూపితంబగు బహురూపవృక్షములు
ఒకదిక్కు మఱిశ్వేత మొకదిక్కు వీత - మొకదిక్కు మాంజిష్ఠ మొకదిక్కు రక్త
మొక్కదిక్కు గపోత మొకదిక్కు నీల - మొక్కటఁదోఁపంగఁ బెక్కువర్ణముల
వఱలి యొప్పెడు బహువర్ణశైలములు - వఱలి యొప్పెడు బహువర్ణవృక్షములు
కొంత విద్రుమమును గొంత ద్రాక్షయును- గొంత దారదవల్లి గొంత దాంబూలి
యేపార మొదలొక్కటే [6]యిట్లుగూడ - రూపితంబగు బహురూపవల్లరులు
నడర నేతెంచి లింగాంగణంబులను - సుడిగొని కసువులు దుడుచుమారుతము
లిమ్ముల [7]లింగాలయమ్ములఁ గలయ - సమ్మార్జనము సేయు స్వల్పవర్షములు
చట్టన నేతెంచి సర్వలింగముల - చుట్టును మ్రుగ్గులు వెట్టుసస్యములు
ఎలమి లింగము లున్నయెడల కేతెంచి - జలకంబు లార్చుచుఁ జనుతీర్థములును
నందంబుగఁ [8]దిగిచి యా లింగములకుఁ - జందనంబులు వూయు చందనతరులు
భ్రాజింప ముప్రొద్దు వటులింగములనుఁ - [9]బూజింప నేతెంచు పుష్పవాటికలు
వేడుక [10]నెపుడువివిధ లింగములకుఁ - గూడి ధూపములిచ్చు గుగ్గులుతరులు
దనర లింగములకుఁ దగ [11]నివాళులిడి - చనుతృణజ్యోతికాష్ఠజ్యోతిచయము
నలర లింగములకు ననయంబు వచ్చి - ఫలములర్పణ సేయు బహువిధతరులు
నమరలింగములకు ననయంబువీగి - యములునివేదించు [12]క్రముకాదితరులు
ధరణి వెండియుఁ దమతమపేళ్లమీఁదఁ - బరగ నీశ్వరనామ మరుదుగా నిలిపి
“వృక్షేశ శర” ణని వృక్షాలయముల - వృక్షలింగముల నర్చించు వృక్షములు
“గిరినాథ! శర”ణని గిరిగహ్వరముల - గిరిలింగములఁ గొల్చు గిరిసమూహంబు
“మృగనాథ శర” ణని మృగనివాసముల - మృగలింగములఁ గొల్చు మృగసమూహములు

  1. నారంగ మొక్క నారదంబొక్క
  2. ఫలపూర మె
  3. ద్రాక్ష
  4. మొరలి
  5. యుండి కూడ
  6. పసరించి
  7. లింగాంగణమ్ముల
  8. డిగిచి
  9. బూజించి చనుదెంచు
  10. తోడ
  11. నివాళించి
  12. క్రముకతరువులు