పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/274

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

67

దల్లి పాముల నేల ధరియింప నిచ్చుఁ? - దల్లి బూడిద [1]యేల తాఁ [2]బూయనిచ్చుఁ?
దల్లి వుచ్చునె భువిఁ దనయునిఁ దిరియఁ? - దల్ల వుచ్చునె సుతు వల్లకాటికిని
దల్లి లేకుండినతనయుండు గాన - ప్రల్లదుఁడై యిన్నివాట్లకు వచ్చెఁ
జన్నిచ్చి పలుమాఱు వెన్నయుఁ బెట్టి - పన్నుగా నిన్నియుఁబాలును బోసి
[3]యాఁకొనఁగాఁ గడు పరసి పాలిచ్చి- సాఁకించి పెనుపదే జనని గల్గినను
దా నింతవాఁడయ్యెఁ దల్లి లేకయును - దానెంత వెరుఁగునో తల్లి గల్గినను?
బెండిండ్ల నోములఁ [4]బేరంటములను - బండువుదినములఁ బాటిజాతరలఁ
దగినపోఁడిమి సేయుతల్లి లేకున్న - వగవరే మఱి యెట్టిమగబిడ్డలైన
నూర కుపేక్షించి [5]యుండంగఁ దగునె? - [6]ఆరంగఁ దల్లి[7]నై హరిని నేనైన
నరసెదఁగాక; యిట్లఱేక పెనుచు తరుణియ కాదెట్లు దల్లి దా” ననుచు
ననయంబు బెజ్జమహాదేవి దాన - జననియై [8]పరమేశుఁ దనయుఁ గావించి
[9]తొంగిళ్లపై నిడి లింగమూర్తికిని - నంగన గావించు నభ్యంజనంబు
ముక్కొత్తుఁ జెక్కొత్తు ముక్కన్నుఁ బులుము - నక్కొత్తుఁ గడుపొత్తునట వీపు నివురుఁ
బెరుఁగంగవలె నని తరుణి వీడ్వడఁగఁ జరణము ల్కరములుఁ జాఁగంగఁదిగుచు
నలుఁగులు నలుచు నర్మిలి గట్టిపెట్టి - జలములు వీపునఁ జఱచు [10]నంతంత
వెగచి బెగడకుండ వెన్ను వ్రేయుచును - నొగి మస్తకమున నీరొత్తు దోయిటను
వదనంబు సొచ్చునో యుదకంబు లనుచు - నదుముఁ [11]బొట్టను నోరికడ్డంబు వట్టుఁ
జెన్నుగాఁ [12]బసుపార్చి చేయు మజ్జనము - గన్నులుఁ జెవులును గాఁడంగనూఁడు
నంగిటముల్లొత్తు నందంద [13]వ్రేల - దొంగిళ్లఁ గార్నీరు దోనెత్తి మిడుచు
బడఁతిచే నీరఁ దూపొడిచి బొట్టడును – [14]మడఁది యంగుష్ఠంబు మన్నింత [15]మెదిచి
[16]కడవ నంటినయట్టి పిడుకవిభూతి - యడరఁ బుత్త్రుని నొసలారంగఁ బూయు
[17]నెత్తుగ్రుంగెడు నని యెత్తంగ వెఱచి - యత్తన్వి ఱొమ్మున నక్కున నదుము
కాటుక [18] యిడునంత గన్నగు ననుచుఁ - గాటుకయిడు మూఁడుగన్నులఁ గలయఁ
జన్నిచ్చుఁ బక్షులఁ జననీదు మీఁద - నన్నాతి గొందిన వెన్నయుఁబెట్టుఁ
జెక్కిలి గీఁటుడుఁ జెలఁగి యేడ్వంగ - నొక్కవేలిడి పోయు నొకకొన్నివాలు

  1. నేల
  2. బ్రుంగనిచ్చు
  3. యాఁకొనకుండంగ నరసి పాలించి; యాఁకొనకుండఁగ డ్పరసి పాలించి(లిచ్చి)
  4. బేరఁటంబులను
  5. యుండుట దగునే
  6. ఆరయఁ
  7. నేహరునకు నైనను
  8. ప్రాణేశుఁ
  9. తొంగిళ్లుపై
  10. నందంద
  11. గడుపునోరి
  12. బసపార్చి
  13. వ్రేళ్ల-పిడుచు
  14. మడఁచి
  15. నొసల
  16. కడువ
  17. నెత్తిబ్రుంగెడు
  18. వార్నంత