44
బసవపురాణము
ననుచు భక్తానీక మచ్చెరువంద- నను[1]షక్తి మ్రుచ్చుల నబ్బసవయ్య
యచ్చులఁగాఁ జూచి యభిమతార్థంబు - లిచ్చి భక్తులఁ జేసె [2]నిజ్జగం బెఱుఁగ
జొన్నలు ముత్తెములైన కథ
మఱియును నొకజంగమం బేఁగుదెంచి - యఱిముఱి నభ్యంజనావసరమున
“[3]నిత్యనేమం బిది నేఁటి మ్రుగ్గునకు - ముత్యాలపొడి మాకు ముక్కుస వలయుఁ
గదలక మెదల కీక్షణమాత్రలోనఁ - బదివుట్ల ముత్యముల్ బసవ! యి”మ్మనిన
సరసర [4]లింగపసాయితశస్త్ర - కరతలుఁడై చూడఁ గనుదృష్టి నున్న
జొన్నల [5]ప్రో(C?)క విశుద్ధముక్తాఫ - లోన్నతరాశియై యున్న నవ్వుచును
“సన్నుత! పదివుట్ల సంఖ్య మీకేల? -యెన్ని మీ వలసిన వన్ని గైకొనుఁడు”
అనవుడు “నట్లకా”కనుచు ముత్యములు- గొనిపోయెఁ బెఱికలఁ [6]దనర నన్నియును.
మొఱటద వంకయ్య కథ
మొఱటద వంకయ్య మున్కొక్కనాఁడు - కఱ[7]కంఠభక్తుఁడొక్కరుఁ డర్ధరాత్రి
నరుదేరఁ బొడగని యడుగుల కెరఁగి- సరసోచితక్రియా[8]సంతుష్టుఁ జేయ;
“మాలింగమునకుఁ నేమమ్మొక్క మొదవు-పాలును మారేడుఁబత్తిరి వలయు,
నటుగాని యవసరం బలవడనేర; - [9]దిటసెల్లునో యని యేఁగుదెంచితిమి
ఎడసేయఁ [10]గా దింక నీక్షణంబునను- గడియింపకుండినఁ [11]గాదు గార్యంబు
హరభక్తు లూర లే రొరుల నే నడుగఁ- బొరుగూరి కీ[12]వేళఁ బోవంగరాదు
ఇంకనె” ట్లన నాత్మ నించుకేనియును- గొంకక వంకయ్య గొడ్డు నక్షణమ
కొనివచ్చి యొకవట్టికొఱట సంధించి- మనసిజహరభక్తమండలిఁ దలఁచి
“యీకొఱటన [13]పత్తిరీ గొడ్డునంద- ప్రాకటంబుగఁ బాలు వడయుదు” ననుచుఁ
గుండ వేగమ కడ్గికొనివచ్చి పిదుకఁ - గుండ నిండఁగఁ బాలు గురిసె నాగొడ్డు
కొఱటనె పత్రి యంకురితమై [14]పరిగె- వఱల నామొఱటద వంకయ్య గోసి
తెచ్చి యా భక్తున కిచ్చి నేమంబు - సెచ్చెరఁ జెల్లించెఁ జెప్పఁ జిత్రంబు
అనఁగ విందుము దొల్లి యాద్యోక్తులందుఁ- గనుఁగొంటి మిప్పు డీ కటకంబునందు
- ↑ రక్తిమై మ్రుచ్చులను బసవయ్య
- ↑ నిలవట్లుగాక
- ↑ ఇక్కడ 'నిత్తెనేమ'మనియు 'ముత్తేలపొడి' యనియు దిద్దఁదగియున్నను, వ్రాతప్రతు లన్నింటను నిట్లేయుండుటచేతను, 'నిత్యనేమ' మని యీ కవి మఱికొన్నిచోట్లఁగూడఁ బ్రయోగించుటచేతను, నట్లు చేయలేదు.
- ↑ వశాయత
- ↑ ప్రోఁగు
- ↑ దనకైనయన్ని
- ↑ కంఠు
- ↑ సంపన్నుఁ సంపూర్ణుఁ
- ↑ ఇటు సె
- ↑ రా
- ↑ గాదు లేదనిన
- ↑ ప్రొద్దువో
- ↑ పత్రియీ
- ↑ తనరె, పర్వె(ర్వ)