పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/164

ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

129


'మొగుడుచు,మొగుడ్చు' అని యేర్పడి దానిపై శిథిలద్విత్వమై 'మొగుడ్చు' కొన్నాళ్లుండి యిప్పుడు మొగుచు రూపముగా మాఱినదనవలెను. 'మొగుపు' అని కృద్రూపముగూడఁగలదు. బూది, బూడిదనుండి యేర్పడిన దనుటకంటె భూతినుండి యేర్పడినదనుట యుక్తము.

షష్ఠీసమాసమున 'పు,ంపు' లు :- పు. 32- 'ధీరంబుకట్ట', 'గంభీరంబు తిట్ట, ఇత్యాదులు. ప్రాచీనకృతులలో షష్ఠీసమాసమున ముకారమునకు 'పు', 'ంపు'లు గానరావని కొందఱందురు గాని యది సరికాదు. బసవపురాణపు వ్రాఁతప్రతులలో రెండురూపములును గానవచ్చుచున్నవి. 'ధీరంపుఁగట్ట గంభీరంపుఁ దిట్ట.” ఇత్యాదిగాఁ గూడఁ గలదు. తిక్కనాదులు దఱుచుగా నిట్టు ప్రయోగించిరి. ప్రాఁత వ్రాఁతప్రతులు చూడఁదగును. ప్రాసస్థలముల లోని ప్రయోగము లనివార్యములు, వానిఁ జూపుచున్నాఁడను. 'చ. తపమును- గల్గు క్రీడిక, య్యపు వెరవెక్కుడై గెలుచునట్లుగ' - కర్ణ.3 ఆశ్వా. 'లావుదేవక' య్యపువెరవేపుదాల్మి - శల్యపర్యము. 'కృపఁ దిలకింపఁ బెంపఁ బరికింపఁ గలాఁడుదయించు నంచు వే, దపుగని వేల్పు సెప్పిన' - సోమన హరివంశము, 2 ఆశ్వా. 'కపటమువన్ని జానకి నకల్మషఁదెచ్చినయట్టి పాపక | ర్మపుఁబొడువన్.” - భాస్కర రామాయణము, యుద్ధకాండము. ఇత్యాదులు. కవిలోకచింతామణిలో వెల్లంకితాతంభట్టు గూడ షష్ఠీసమాసమున నీ యాదేశము గలదని వచించెను.

తదియ్యము : పు. 129 - 'అయ్యా యనఁగ నేమి యయ్యా యనెడు తదియ్యవాక్యంబునజ్జియ్య యడంచి' ఇందు 'తదియ్య' పదము సంస్కృతవ్యాకరణవిరుద్దము. 'తదీయ' ఉండవలెను. అట్లు దిద్దినచోఁ బ్రాసభంగమగును. 'జియ్య'కు 'జీయ' రూపాంతరము గలదు. దీర్ఘములమీఁది య, వ, లు కొన్ని ద్విత్వమును జెందుట, పూర్వదీర్ఘము హ్రస్వమగుట ప్రాకృతమునను, దెనుఁగునను గలదు. 'హైయంగవీనము'ను 'హయ్యంగవీన' మని వ్రాయుట, యుచ్చరించుట గలదు. ఐయున్న అయ్యున్న యని యౌవనము జవ్వనమని యయినట్టు తదీయము తదియ్యము కావచ్చును. ప్రకృతులకే కాక ప్రత్యయములకుఁగూడ వికృతిరూపములు గలవు. కాని, యిది సంస్కృతసమాసమున నున్నది. నన్నిచోడఁ