పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అందు.

35


క.

ఇమ్ముగ నుదయించిరి జన
సమ్మతుఁ డగుమల్లనకును జగ్గన యనఁగాఁ
దమ్మయ సూరయ చిన్నయ
తిమ్మయ లనఁ బరఁగుసుతులు ధృతిబలసహితుల్.

36


క.

ఆమల్లనకును జన్నను
చే మంత్రుల కెల్ల గుణవిశేషంబులచే
భూమిన్ జ్యేష్ఠుఁ డనంగ మ
హామహిమౌదార్యుఁ డమరనార్యుఁడు వెలసెన్.

37


సీ.

[1]చిఱువన దేచిరా జెఱుక మించిన బుధో
             త్తముఁ డేవధూమణితాతతండ్రి
యనవరత మునికి నాయూరిపేరఁ దా
             వెలయు కేసయ్య యేవెలఁదితాత
యన్నయ బాపయ్య లగ్రజానుజులుగాఁ
             బరఁగుభావయ్య యేగరితతండ్రి
జయనయోన్నతులు కొండయరాఘవార్యు లే
             సతి కన్నదమ్ములై నుతులు గనిరి


ఆ.

పృథివి నేపురంధ్రి పెదతండ్రికొడుకు స
త్కీర్తిశోభితుండు కేసవిభుఁడు
తనరు నేగుణాఢ్యపినతండ్రిసుతుఁడు గం
గయ్య బహుసహోదరాంచితుండు.

38


తే.

రమ్యగుణనిధి యన్నమ్మ రాచపూడి
గణపతిసుపుత్త్రి యేసాధ్వికన్నతల్లి

  1. వ్రాఁతప్రతులందుఁ బైయట్లు కలదు. ముద్రితప్రతిలో "చిఱుమనఁ దెచ్చి రాచఱిక మిచ్చిన" అని కలదు.