ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇందునాలుగు నగణములు చివర సగణ మున్నది.
- న న న న స
- అనవు | డుమన | సునున | తిముద | మునన | వ్వ
అప్పకవీయమున నిట్లే కలదు.
మణిగణనికరము మను లఘు గురువై (4-305)
మణివిరమణమయి మనుదనుజహరున్.
మణివిరణమనగా 9వ యక్షరముపై యతి. మణు లనగా రత్నములు, రత్నములు తొమ్మిది.
7. విద్యున్మాల (5-78)
| అమ్మ యిన్నా ళ్లత్యంతాయా | |
ఈ వృత్తము 8 వడియగు అనుష్టుప్ ఛందస్సులోనిది. అప్పకవీయలక్షణమునకు సరిగా నున్నది.
- మ మ గగ
- అమ్మాయిన్నాళ్లంత్యంతాయా
ఈ వృత్తము సాధారణముగా కవులు వాడుక చేయలేదు.
8. చిత్రకవిత - గర్భకవిత
ఇందొక్కచో గర్భకవిత కలదు.
కందగర్భిత మణిగణనికరము