పుట:ప్రబోధచంద్రోదయము.pdf/84

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లెల్ల నాహవపరాఙ్ముఖు లైరి" (ఆర 4-12), తిక్కనలోను వ్యంజనయతి.

సీ.పా.

దానశీలురు పరధన పరదార ప
              రాఙ్ముఖచిత్తులు బ్రాహ్మణప్రియులు

శాంతి (5-11)

ఎఱ్ఱన మాత్రము స్వరయతి పాటించినాడు.

సీ.పా.

ప, రాఙ్ముఖు లార్యభావానుగతులు

హరి.పూ (8–54)

రాగమ సంధియతి

జోగు, రాలి గూడితంట రాకుమన్న(3-49)

ఇట రాలు (రు అ) శబ్ధములో వ్యంజనయతి. అప్పకవి రాగమసంధివళులనుపేర 'రాలు ధర్మాత్మురా లన రాక్షసారి' (3-215) అని దీనికి లక్షణము చేసినాడు. కాని చిన్నయసూరి ననుసరించి రాలు శబ్దము (రు అ) అని పదచ్ఛేద మగుటచే దానికి స్వరయతియేగాని వ్యంజనయతిలేదు. “ఏకాంతమునందు నున్న జవరాండ్ర" అని అతడే యుదాహరణ నిచ్చినాడు (చూ. సూత్రము 30 సంధి పరిచ్ఛేదము) దీనిని గూర్చి నేను పూర్తిగా చర్చించి రాలు శబ్దములలో స్వర, వ్యంజన యతులు రెండును నుండవచ్చునని నిర్ణయించినాను.[1]

సోదర శబ్దము

స్వరయతి

సోదర వధా వ్యసన సంభవోరువహ్ని(4-52)

ఇచట స ఉదర అని పదచ్ఛేదము. సహోదరశబ్దమున సః ఉదర అని పదచ్ఛేదము

  1. ఈ రాలు శబ్దమునుగూర్చి చూడుడు Annals of Oriental Research Madras University పత్రిక యందు సం. 18(1968) లో నావ్యాసము “రాలుప్రత్యయచరిత్ర”