పుట:ప్రబోధచంద్రోదయము.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రబోధచంద్రోదయము

ఇది అనంతామాత్యుని గంగమంత్రికి కృతి - ఆతడు క్రీ.శ. 1460 ప్రాంతముననున్న పూసపాటి బసవభూపాలుని మంత్రియని యీ కావ్యముననే గలదు-

......తమ్మయామాత్య విభుకుమార
వీరబసవక్షమాచక్రవిభునిచేత
మన్ననలు గాంచి మించిన మహితుఁ డితఁడు
మనుజమాత్రుండె గంగయామాత్యవరుఁడు.

(1-16)

కావున నీకృతి రచనాకాలము క్రీ శ. 1460 ప్రాంతము కావలెను. ఈకృతియందు.

"శ్రీకర నరసింగ నృపవశీకర నయవిద్యాకరణ"

(2-1)

యనుపద్యములలో నరసింగనృపతి యొకడు పేర్కొనబడియున్నాడు.

ఈనరసింగనృపతి సాళువనరసింగరాయలే యైనచో నీతడు విజయనగరరాజ్యమును సంగమవంశీయుల వెనుక క్రీ శ. 1486నుండి క్రీ.శ. 1493వఱకు పాలించెను. అప్పుడు ప్రబోధచంద్రోదయము - క్రీ.శ. 1493 మధ్య రచితము కావలెను.

కీర్తిశేషులు శేషయ్యగారు మాత్రము పైకృతి కాలనిర్ణయమున భిన్నాభిప్రాయము కనబఱచినారు

"సాళువ నరసింగరాయని జీవగ్రాహముగా బట్టుకొనుటలో పురుషోత్తమగజపతికి బసవనృపాలుడు విశేషసహాయము చేసి యుండును. ఆఘనకార్యము సాధించుటకు గంగయమంత్రి బుద్ధిచాతుర్యము ప్రధానకారణమైయుండును. ఈభావమే “నరసింహ నృపవశీకరనయవిద్యాకరణ" అను వాక్యములో సూచింప బడినది. పురుషోత్తమగజపతి క్రీ.శ.1366 మొదలు 1396వఱకు రాజ్యము చేసినాడు. సాళువ నరసింహరాయలను 1367 ప్రాంతమున గజపతి పట్టుకొని