పుట:ప్రబంధరత్నాకరము.pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యాననాంబుజముల నళులు పైకొన కున్నె
              మేను సంపెఁగతావిఁ బూనెఁ గాక


తే.

[1]యొప్పు [2]కనుఁబాటు దాఁకక యున్నె రత్న
భూషణద్యుతు లొక్కటఁ బొదిలెఁ గాక
[తలఁప నచ్చెరువైన యీ]తరళనయన
యవయవశ్రీల లీల లేమని నుతింతు.

51

[4-17]

సీ.

భామినీమణిమధ్యభాగంబు కృశమని
              కటితటంబున [3]నిల్పె గౌరవంబు
తొయ్యలి వలిచ[న్నుదోయి కర్కశ]మని
              య[డగు]ల మార్దవం బలవరించెఁ
గమలలోచన కుంతలములు వక్రములని
              తనువల్లికకుఁ జక్కదనము నొసఁగెఁ
బూదీగెబోణి చూపులు [చంచలము లని
              మె]లపు నెన్నడవున మేళవించె


తే.

నబల నఖములు క్రూరము లని తలంచి
సౌమనస్యంబు గుణమున సంతరించి
నీరజాననుఁ డెంతకు నేరఁడంచు
[జగము గొనియా]డ నొప్పు నా చిగురుబోడి.

52

తులసి బసవయ్య – సావిత్రికథ

సీ.

వదనాంబుజంబుపై వ్రాలిన మదభృంగ
              జాలంబు ల[బల]నీలాలకములు
రదనముక్తాఫలప్రకరంబు దాఁ[చిన
              పవడంపునునుగ్రో]వి పడఁతి మోవి
యౌవనాంభఃప్రవాహములోనఁ దేలెడు
              జక్కవకవ కాంత చన్నుదోయి
నతనాభికూపసంగతయైన నవజల
              ద్రోణి పల్లవపాణి రోమ[రాజి]


తే.

+ + + + + + [రా] మణికి నిడిన
కమ్మ పూదండ లబ్జాక్షి కరయుగంబు
చరణపద్మముల్ ముట్టం[గఁ జా]లునట్టి
కరికరంబులు నిడువాలుఁగంటి తొడలు.

53
  1. క.యొంట
  2. క.కనుచాటు
  3. క.నిచ్చె