ప్రౌఢకవి మల్లయ రుక్మాంగదచరిత [3-6]
సీ. |
పసిఁడిపువ్వులు పట్టుపచ్చడంబులు రేఖ
చీరలు గుజ్జరిపారువములు
చమురుకావళ్ళు రాజనపుబియ్యమ్ములు
చెఱుకుఁగోలలు కందచిరుగడములు
మినుములు పెసలు మామిడితాండ్ర టెంకాయ
యల్లంబు తమలంపుటాకుఁ గట్లు
[1]మేకపోఁతులు పండుమీను తట్టంబులు
ఖర్జూరములు తేనె కలపు పైర్లు
|
|
తే. |
[2]దోని మెకములు పందులు దుప్పి తొడలు
పనసపండ్లును బెల్లంబు పంచదార
గసగసలు సారపప్పు ద్రాక్షఫలములును
గొనుచుఁ బ్రజ లేఁగి రవనీశు కొలువునకును.
| 47
|
బమ్మెర పోతరాజు – నవమస్కంధము [333]
సీ. |
[3]కలఁగు టెల్లను మానెఁ [4]గంధు లేడింటికిఁ
జలనంబు మానె భూచక్రమునకు
జాగరూకత మానె జలజలోచనునకు
దీనభావము మానె దిక్పతులకు
మాసియుండుట మానె మార్తాండ[5]విధులకుఁ
గావిరి మానె దిగ్గగనములకు
[6]నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల
కడఁగుట మానె ద్రేతాగ్నులకును
|
|
ఆ. |
గడిఁది వ్రేఁగు మానెఁ గరిగిరికిటినాగ
కమఠములకుఁ బ్రజల కలఁక మానె
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
ధరణిభరణరేఖఁ దాల్చు తఱిని.
| 48
|
సీ. |
పొలతుల వాలుచూపులయంద చాంచల్య
మబలల నడుములయంద లేమి
కాంతాలకములంద కౌటిల్యసంచార
|
|
- ↑ గ.దంతపుఁబ్రతిమలు దానిమ్మఫలములు
- ↑ గ.దోమతెఱమంచములు నంపదొనలు విండ్లు
- ↑ క.కలిగియుండుట
- ↑ క.కందు లేదేటికి
- ↑ క.బింబంబు
- ↑ క.నుడుగు