తే. |
శక సుధేష్ణ త్రిగర్త దశార్ణ వార్ణ
కాలు కాంభోజ దరద [1]ఖింకాణ హోణ
[2]సుంహనోత్కళ బహుధాన శూరసేన
యవన మద్ర మరుద్ర దేశాంధ్రవిభులు.
| 44
|
దుగ్గన – నాసికేతోపాఖ్యానము [2-169]
సీ. |
పాండ్య కేకయ చోళ [బర్బర పాంచాల]
బంగాళ లాట నేపాల గౌళ
గాంధార సౌవీర కాంభోజ కాశ్మీర
హేహయాభీల బాహ్లిక విదేహ
మగధ మద్ర విదర్భ మాళవ కేరళా
శ్మంతక కుంతల మత్స్య వత్స
కరహాట మరహాట కర్ణాట శకలాట
కుకుర కోసల కాశ కురు కరూశ
|
|
తే. |
[3]సుంహ్మ సౌరాష్ట్ర గుజరాష్ట్ర శూరసేన
చేది సింధు యుగంధర [4]చేకితాన
యవన బహుధాన మలయాన కాంగ వంగ
తేంక ణాంధ్ర కళింగాది దేశములకు.
| 45
|
రాజదర్శనమునకు
మద్దికాయల మల్లయ్య - రేవతీపరిణయము
సీ. |
అమృతాంశుబింబంబు నవఘళింపఁగఁజాలు
తీయని పెద [5]పెద్ద తేనె [6]పెరలు
కలశాంబునిధి తరఁగల పిల్ల లనఁజాలు
సాంద్రదీర్ఘవలక్షచామరములు
+ + + + + + + + + + + + + + +
+ + + + + + + + + + +
తారకంబుల యొప్పిదములు గాదనఁజాలు
వైణవమౌక్తికవ్రాతములును
|
|
తే. |
నాది యగు దివ్యవస్తుసంహతులు దెచ్చి
యవనమండలపతి కుపాయనము లిచ్చి
విన్నపము చేసె నిట్లని వేడ్కఁ దనదు
డెందమునఁ గందళింపఁ బుళిందవిభుఁడు.
| 46
|
- ↑ చ.కంథాణ
- ↑ క.సుంహ్వన, చ.సుంహల
- ↑ క.సుహ్న
- ↑ క.కేకితాన
- ↑ చ.పెన
- ↑ క.తెరలు