సాహిత్యము
సీ. |
[1]ఊరక మూయక యుబ్బసం బందక
వెఱవక దేహంబు విఱుచు కొనక
నిడుచన వెట్టక నిద్దొట + + + +
[త]రవాయి దప్పక తడవికొనక
యక్షరాస్పష్టత [2]యతిగీతనష్టత
కాకుండ నర్థంబు గానఁబడఁగ
ఆ యా రసమ్మున కనురూపముగఁ బెక్కు
రాగముల్ ఫణుతులు బాగు పుట్టఁ
|
|
తే. |
జెఱకు కొననుం + + + + వు దోఁప
నంతకంతకు [వేడుక] లతిశయిల్లఁ
జదువుకొన్నారు వీరల చదువుఁ బోలఁ
జదువు లేదని పొగడిరి సభికవరులు.
| 33
|
చ. |
వెనుకకుఁ బోక [3]యీ యనక వేసట నొందక పంక్తి [పంక్తికిన్
బెను]పక కానమిన్ బ్రమసి బెగ్గిల కెంతయు మున్న చూచుచున్
కనుఁగొని యక్షరాక్షరము కందువ దప్పక యేకచిత్తుఁడై
యనుపమభక్తితోఁ జదువు నాతని వాచకుఁ డండ్రు [4]సజ్జనుల్.
| 34
|
జక్కన - సాహసాంకము [2-118]
సీ. |
బ్రహ్మాయురస్తు విప్రప్రసాదో౽స్తు క
ల్యాణపరంపరావాప్తిరస్తు
దేవేంద్రభోగో౽స్తు దిగ్విజయో౽స్తు సు
[5]స్థిరకీర్తిరస్తు వాక్సిద్ధిరస్తు
సౌభాగ్యమ + + + + సమున్నతిరస్తు
సంగరవిజయో౽స్తు సౌఖ్యమస్తు
వస్తువాహనసంపదస్తు చింతితమనో
రథసిద్ధిరస్తు సామ్రాజ్యమస్తు
|
|
తే. |
సప్తసాగరపరివృతసకలభూమి
మండలైకాధిపత్యసమాగమో౽స్తు
పుత్త్రపౌత్త్రాభివృద్ధివిస్ఫూర్తిరస్తు
మంగళాని భవంతు తే మనుజనాథ!
| 35
|
- ↑ చ.ఊఁకరల్ గొట్టక
- ↑ క.యణిగిత
- ↑ క.యా
- ↑ చ.భూవరా
- ↑ క.స్థిరమస్తు సంకల్పసిద్ధిరస్తు