పుట:ప్రబంధరత్నాకరము.pdf/89

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నృత్యమునకు

దామరాజు సోమన – భరతము

మ.

అడుగుల్ ముప్పదియాఱిటన్ వెడలుపై హస్తత్రిషట్కంబుచే
నిడుపై యున్నతమై సమస్థలమునై [1]నిర్మోకహస్తాంకమై
మృడుమిత్రబ్ధివులొందు(?) వాకిలొకటై మించన్ గవాక్షంబు లిం
పడరన్ శాలను రాజు షడ్విధము నాట్యం బట్లు సేయించుటన్.

23


సీ.

[మొదలఁ] బుష్పాంజలి ముదమునఁ గావించి
              [2]కరబాళి మొగబాళి సరవు లెత్తి
యురుపృథ[3]బాళము లొగిఁ బిల్ల మురువును
              హస్తప్రకరణము [4]లనువు [5]పఱిచి
కడకట్టు శబ్దంబు కడఁగి దర్వును జిందు
              బాగైన గీతప్రబంధములును
కుండలిబహురూపదండలాస్యవిలాస
              దేశిమార్గంబుల తెరువు లెఱిఁగి


తే.

నయము బిఱుసును నరిగతుల్ కడిఁది గాను
తిరువు మురువును నిలుకడ తిన్న నగుచు
పాత్రఁ గొనిపించఁ గొనఁగను బ్రౌఢియైన
వాఁడె నటుఁ డనఁబరఁగు నీవసుధయందు.

24

నూతనకవి సూరయ – ధనాభిరామము

చ.

ఇరువదియాఱువీక్షణము లెన్నగ నాలుగువక్త్రచేష్ట లిం
పరుదుగ నేడు భ్రూనటన [లాపయి] నాలుగుదోర్విలాసముల్
సరసతఁ జూపి హంసవృషసామజవాయసశుద్ధసంగతుల్
పరువడి ముట్ట నిల్పి సితపంకజలోచన పాడుచుండఁగన్.

25

జక్కన - సాహసాంకము [2-91]

సీ.

శృంగార మింపార నంగవల్లికయందు
              గీతసామగ్రి యంగీకరించి
కరతలామలకంబుగాఁ గరాంబుజముల
              నర్థ మాద్యంతంబు నభినయించి
భావింప నరుదైన భావమర్మంబులు
              మెఱుఁగుఁజూపులలోన మేళవించి

  1. క.నిశ్శేష
  2. క.చాళి+మగపాళుల
  3. క.వాళము
  4. క.లేన
  5. క.చరచి