పుట:ప్రబంధరత్నాకరము.pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జలధివలయితవసుమతీచక్రవహన
చండభుజదండకలితుఁడై యుండునంత.

11

మాదయగారి మల్లన - రాజశేఖరచరిత్ర [1-54]

సీ.

[శ్రీసతీ]సీమంతసిందూర[వేదిక]
              కపటారికాసారగంధకరటి
గంభీరగుణకథాకలశపాథోరాశి
              సాతత్య[1]సత్యవిశ్రమణసీమ
[2]సకలబాంధవ[3]కలాపికలాపనీరదం
              బుది[తాఘ]ధరణి[భడద్భిదురపాణి]
నిజకీర్తివల్లరీనీరంధ్రదిగ్వీథి
              కవికుటుంబత్రాణకల్పశాఖి


తే.

సజ్జనానూనకరుణారస[4]ప్రవర్తి
భూజనాత్యంతసంస్తుత్యపుణ్యమూర్తి
కామినీలోకహృద్వశీకరణపుష్ప
ధన్వుఁ డన నొప్పు [నా హోమధ]న్వనృపతి.

12

తిక్కనసోమయాజి – విరాటపర్వము [2-204]

సీ.

తొడరిన హరునైన దోర్బలంబునఁ దన్ను
              మిగులఁగనీఁ డను మేటిమాట
యమరేంద్రు నర్ధా[5]సనమునకునైన
              నర్హుడెంతయును[నను రూఢిమాట]
జమునిల్లు సొచ్చిన జంతువునైనను
              కాచు నెమ్మె[యి]నను రాచమాట
దనుఁ గోరి యూర్వశి తాన వచ్చిననైన
              లోలుండు గాఁడను మేలిమాట


తే.

శౌర్యవైభవప్రాభవశౌచములకు
నొరులకైనఁ గైవారమై యుల్లసిల్లు
నొక్కరుని కివియెల్లను నిక్కమట్టె
యెందుఁ గలుగునె యర్జును నీఁడు వాఁడు.

13

నన్నయభట్టు – సభాపర్వము [1-18]

మ.

మదమాతంగతురంగకాంచనలసన్మాణిక్యగాణిక్యసం
పద లో[లిం గొనివ]చ్చి యిచ్చి ముదమొప్పం గాంచి సేవించి ర

  1. క.విక్రమక్రమణి
  2. క.కలకల
  3. క.కాశీవికా
  4. క.ప్రవృత్తి
  5. క.నంబునకైనను