బమ్మెర పోతరాజు - దశమస్కంధము [10-1-1608]
క. |
పులులపగిదిఁ గంఠీరవ
ములక్రియ శరభములమాడ్కి ముదితమదేభం
బుల[1]తెఱగున నానావిధ
కలహ[2]మహోద్భటులు భటులు గల రా వీటన్.
| 288
|
[3]సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము (1-12)
క. |
ప్రతివర్షంబును ధర ను
ద్ధతిఁ బడియెడి పిడుగులెల్లఁ దగఁ గూర్చిన రా
కృతులుగ నిర్మించెనొకో
శతధృతి యన వీట సుభటసంఘము వొలుచున్.
| 289
|
తులసి బసవయ్య - సావిత్రికథ
క. |
బీరమునఁ బొదలి సమర
ప్రారంభమె పెండ్లి యనుచు బల[4]వర్గమునన్
వైరులకు వెన్ను చూపని
శూరవ్రజ మప్పురమునఁ జూడఁగ [5]నమరున్.
| 290
|
కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము
క. |
తఱుము దురంతకునైనను
వెఱచఱువఁగ భద్రకరుల విఱుతురు హరి ను
క్కఱఁ బట్టి చట్ట లేరుదు
రుఱుకుదు [6]1రుగ్రాగ్నినైన నురుభటు లందున్.
| 291
|
పిల్లలమఱి వీరయ్య – శాకుంతలము [1-79]
క. |
సంగరము లేక యుండిన
సింగంబులఁ బులుల సమదసింధురముల నే
కాంగిఁ దొడరి పడవైతురు
పొంగునఁ దమ కుబుసుపోక [7]పురవీరభటుల్.
| 292
|
మ. |
విమలశ్రీపదపద్మజ ... ముఖావిర్భూతనానావిధో
త్తమభవ్యస్తుతిపాత్ర! పాత్రగురుపుత్త్రానంద నందానదా
|
|
- ↑ క.తీరున
- ↑ క.మదో
- ↑ సుంకసాల
- ↑ ట.వర్షమునన్
- ↑ ట.నొప్పున్
- ↑ యుగాగ్నికైన
- ↑ క.పురి