పుట:ప్రబంధరత్నాకరము.pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[?]

ఉ.

చెక్కుల దాన మక్షులను సీధువు వీనుల సాగరంబు చే
ముక్కున శీకరాళి చనుముక్కుల చిక్కము శేఫసిన్మదం
బక్కున ఘర్మవారియు నిజాంఘ్రుల మేఘముఁ గారుచుండఁగా
నొక్కమదేభ మేఁగెఁ దలయూ[1]గులతోడి నగేంద్రమో యనన్.

276

బమ్మెర పోతరాజు - అష్టమము [8-40]

సీ.

తనకుంభములపూర్ణతకు డిగ్గి యువతుల
              కుచములు పయ్యెదకొంగు లీఁగఁ
దనయానగంభీరతకుఁ జాల కబలల
              యానంబు లందెల నండగొనఁగఁ
దనకరశ్రీఁ గని [2]తలఁగి బాలల చిఱు
              దొడలు మేఖలదీప్తిఁ దోడు పిలువఁ
దనదంతరుచికోటి తరుణుల నగవులు
              ముఖచంద్రదీప్తుల ముసుఁగు [3]దిగువఁ


తే.

దనదు లావణ్యరూపంబుఁ దలఁచి చూడ
నంజనాభ్రము కపిలాదిహరిదిగింద్ర
దయిత లందఱుఁ దనవెంటఁ దగిలి నడవ
కుంభివిభుఁ డొప్పె నొప్పులకుప్ప వోలె.

277

బొడ్డపాటి పేరయ - పద్మినీవల్లభము

క.

ఒక యెనిమి దణఁగె దిక్కుల
మకరంబున కొకటి యోడె మలహరుచే ము
న్నొక టూడె ధిక్కరింపఁగ
నిఁక నేలని మాఱు మలయు నేనుఁగులు పురిన్.

278

అశ్వవర్ణన

[4]సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [1-14]

సీ.

[5]కట్టడిఁ జెలియలికట్టయె కట్టఁగా
              బిగువుమై బేరెంబు వెట్టకుండ
లంఘనలాఘవోల్లసనంబు మై మొక్క
              లించి వార్థులు చౌకళింపకుండ
బిట్టు దిగంతముల్ ముట్టఁ జూపిన విధి
              పవమాను కడఁ దెగఁబాఱకుండ

  1. క.బల
  2. క.తలఁకి
  3. క.లిడగ
  4. సుంకసాల
  5. క.కంటివె