|
పుష్కరపూత్కారములన కాలపు వాన
కారు లెల్లెడఁ [1]దము తారఁ గురియఁ
|
|
తే. |
దమకుఁ బరవాహినులలోను దఱియఁజొచ్చి
క్రీడ లాడుట యుచితంపు జాడ యనఁగఁ
బెరిఁగి సరయూజలంబుల సరసలీలఁ
గ్రాలఁ జనుచుండు నప్పురి గంధకరులు.
| 271
|
చ. |
సురపతి దాడి నంబునిధిఁ జొచ్చిన యద్రులు నిచ్చలప్పురిం
దిరుగఁగ నాత్మఁ గోరి శరధిం బరిఖాకృతిఁ గాపు వెట్టి తా
రరుదుగ భద్రసామజములై సెలయేఱులు దానధారలై
తొరఁగుచునున్న మాడ్కి [2]నతిదుస్సహతం గరు లొప్పు నప్పురిన్.
| 272
|
చ. |
తరళితదంతకాంతిసముదంచితబృంహితనీలదేహముల్
పరఁగఁ దటిల్లతాస్తనితభాసురవారిధరంబులో యనన్
బొరిఁబొరి నేనుఁగుల్ దిరిగి పుష్కరిణీకరదానధార ల
ప్పురమునఁ బెల్లుగాఁ గురియు భూతలమంతయుఁ బంకిలంబుగాన్.
| 273
|
తులసి బసవయ్య - సావిత్రికథ
ఉ. |
గైరికమండనంబులు నఖర్వసమున్నతపాదపంక్తియున్
హారిమదాపరాశి యపహార్యసమంచితసత్త్వరేఖయున్
ధారు[ణి] మీకు మాకు విదితంబుగ సాటియె పొమ్మటంచు దు
ర్వారగతిన్ హసించు గిరివర్గము [3]నప్పురి వారణౌఘముల్.
| 274
|
మాదయగారి మల్లయ - రాజశేఖరచరిత [1-51]
క. |
అన్నగరి చిఱుతయేనుఁగు
గున్నలపై నెక్కి [4]నిక్కి కోయఁగ వచ్చున్
మిన్నేటి పసిఁడితామర
లన్నన్ మరి యేమి చెప్ప నందలి కరులన్.
| 275
|
- ↑ క.దిమదిమ గురియగ
- ↑ క.నరి
- ↑ ట.దత్పురి
- ↑ క.నెక్కి