|
దనుపారఁ గొలఁకుల దగ నాడి వనకేళి
జనులపైఁ బులుకలుఁ జాదుకొల్పుఁ
|
|
తే. |
[1]గేరి మకరందములఁ దొలఁకించి మించి
మొనసి లేఁదీఁగెలకుఁ జిఱుముసురు గురియు
నప్పురారామముల నెల్ల నలసగతుల
మలసి సొంపారు నింపారు మారుతంబు.
| 265
|
ప్రౌఢకవి మల్లయ్య - రుక్మాంగదచరిత [5-45]
సీ. |
వనజాత[2]కహ్లారవనజాతయుతసరో
వరవీచికలమీఁద వ్రాలి వ్రాలి
కలకంఠశుకశారికాకంఠకాకలీ
కలితచూతములపైఁ గ్రాలి క్రాలి
మల్లికామాధవీ[3]మందారనూతన
సూనగంధములపై సోలి సోలి
కేళీవనాంతరకంకేలిశాఖా[4]శిఖాం
దోలాగతాళిఁ బోఁదోలి తోలి
|
|
తే. |
యల్లనల్లనఁ జనుదెంచె నలసగతుల
భావభవసంగరాయాసభామినీకు
చాగ్రసంజాతఘర్మంబు లణఁచి యణఁచి
చందనపుఁగొండఁ బుట్టిన చల్లగాలి.
| 266
|
పోతరాజు భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [4-275]
సీ. |
పరిపాండుకేసర పరిణాహకేసర
ప్రసవరాగంబు కొసరి కొసరి
వర్షితకాసారవరవీచికాసార
శిశిరశీకరములఁ జెలఁగి చెలఁగి
గుణవతీమనసారకుచలిప్తఘనసార
బహుళసౌరభముల బలసి బలసి
కమనీయమణిజాలఖచితసద్గృహజాల
మాలికాంతరముల మలసి మలసి
|
|
తే. |
సమదకరికటతటమదసలిలపాన
ముదితకలరవమధుకరమృదులచలిత
లలితవిపరీతగరుదంచలములఁ బొదలి
మలయపవనుండు పురిలోనఁ గలయఁ బొలయు.
| 267
|
- ↑ క.కేళి
- ↑ క.కల్హార
- ↑ క.వల్లికానూనప్ర
- ↑ క.శిఖాడోలా