పుట:ప్రబంధరత్నాకరము.pdf/72

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

సీ.

వలరాజు వోసిన [1]నలినారువోలె బం
              ధురములగు జెఱకుఁదోఁటలకును
నలువచేఁ [2]బెరిఁగి దీనుల కీఁగియును లేని
              కల్పకంబులు వోని క్రముకములకు
మాధవుం డేదిన మవ్వంపుఁ [3]బొదల యే
              డ్తెఱ నివ్వటిలు నాకుఁదీఁగెలకును
బర్జన్యసత్కృతిఁ బసిఁడి [4]పండెడుచే ల
              నంగఁ [5]బేర్చిన రాజనంబులకును


తే.

దెట్టుపలు గట్టి నీటితోఁ దేలి పాఱు
తమ్మిపుప్పొళ్ళు ప్రోదులై దనరుచుండు
ననిన నవ్వీటి చెఱువుల యతిశయంబుఁ
బుడమిలో నింక [నేమని] పొగడవచ్చు.

263

సంకుసాల సింగయ - కవికర్ణరసాయనము [1-25]

సీ.

ప్రణయవాదముల దంపతులందు నుదయించి
              రంజిల్లు మానాంకురములు మేసి
సురతాంతవిశ్రాంతసుందరీజనముల
              వక్షోజతటఘర్మవారిఁ గ్రోలి
వనములు మధుగర్భవతులుగాఁ బూమొగ్గ
              మొదవుల కౌమారములు హరించి
విషయానుభవకథావిముఖవిరక్తుల
              పటుతరధైర్యవప్రములు గూల్చి


తే.

గంధలోభానుబంధిపుష్పంధయముల
ఝంకృతులచే ఖణిల్లన ఱంకె లిడుచు
విషమశరు పేర జన్నియ విడిచి రనఁగఁ
గ్రొవ్వి చరియించు నవ్వీటఁ గోడెగాడ్పు.

264

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరితము

సీ.

పరువంపు విరులపైఁ బొరసి యొండొకవనం
              బుల సౌరభంబులఁ బొరపు సేయుఁ
బక్కు వాసిన పువ్వుఁ బదువుతోఁ జెరలాడి
              యిలకు [6]నైవేద్యకం బలవరించుఁ
గొవ్విరులను దిరుగుడువడి పుప్పొడి
              దలిరాకులకు వింత చెలు వొనర్చుఁ

  1. ట.విలునాఱు
  2. క.జరిగి దివకుల కనియును లేని
  3. ట.బొరల
  4. క.నందెడు
  5. క.నేర్చిన
  6. ట.వేద్యంకంబు