పుట:ప్రబంధరత్నాకరము.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

బాలశైవాలవల్లరీజాలకంబు
బాడబానలభవధూమపఙ్క్తి గాఁగ
వారిరాశియుఁ బోలె గంభీరమైన
ఘనతటాకంబుఁ గాంచె నా జనవిభుండు.

260

నంది మల్లయ్య - మదనసేనము

సీ.

పరిఫుల్లహల్లకప్రభలు నిండినచోట
              సాంధ్యరాగద్యుతి చౌకళింప
వికచనీలోత్పలప్రకరస్థలంబుల
              గిఱికొన్న చీఁకట్లు గ్రేళ్ళు దాఁట
నిర్ణిద్రకుముదవనీప్రదేశంబులఁ
              దేఁటవెన్నెల పిల్ల తీపు లాడ
వికసితకనకారవిందబృందంబులు
              బెరయు నీరెండఁ బింపిళ్ళు గూయఁ


తే.

బగలు రేయును దమలోనఁ బగలు మాని
కలసి మెలసిన బాగులు గడలు కొల్పి
విమలమహిమలఁ దనరు నా విమలసరసిఁ
జూచి నివ్వెఱపడి రాజసూనుఁ డపుడు.

261

కేతన - కాదంబరి

సీ.

దీనిలోపలఁ గొన్నిదినము [1]లుండిన నుష్ణ
              కరుఁడైన నట శీతకరుఁడు గాఁడె
దీనిలోఁ తెరిగినఁ దానంబురాశిలోఁ
              గాదని జలశాయి గాఁపు రాఁడె
దీని తియ్యనినీరు దివిజులు [2]త్రావిన
              తమ యమృతంబు చేఁ దనుచు ననరె
దీని తోయంబులఁ దీర్థమాడిన [3]యంతఁ
              బాపాత్ములును మోక్షపదవిఁ గనరె


ఆ.

యనుచుఁ గొలనినీటి యతిశీతలత్వంబుఁ
బఱపు పెంపుఁ దీపుఁ బావనతయు
మనుజనాయకుండు గొనియాడి పడివాగె
త్రాట హయముఁ దిగిచి తఱియఁ జొచ్చె.

262
  1. క.లూనిన
  2. ట.త్రావి చూచినఁ దమ యమృతంబు చేఁదునారె?
  3. ట.నెంత