పుట:ప్రబంధరత్నాకరము.pdf/69

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భైరవుఁడు - శ్రీరంగమహత్త్వము [4-273]

సీ.

మదషట్పదంబుల మధుపానభూములు
              రాజకీరంబుల రచ్చపట్లు
పుంస్కోకిలంబుల భోజనశాలలు
              మలయానిలంబుల మలయునెడలు
[1]నవమయూరంబుల నాట్యరంగంబులు
              మకరకేతను సభామండపములు
విటవిటీజనముల విరుల చప్పరములు
              మధులక్ష్మి [2]నైపథ్యమందిరములు


తే.

నల వసంతుని లీలావిహారసీమ
[3]లిట్టలంబగు [4]వలపుల పుట్టినిండ్లు
చిరపరిశ్రాంతపథికసంజీవనములు
పావనంబులు పురము కేళీవనములు.

253

నండూరి మల్లయ్య - హరిదత్తోపాఖ్యానము

చ.

నవరుచిపల్లవస్థితిఁ దనర్చి లసత్సుమనస్సమృద్ధివై
భవమున [5]నొంది గంధబహుబంధురతన్ దగి యాశ్రితద్విజో
త్సవములఁ బొల్చి వారవనితామణిరీతిఁ ద్రివిష్టపంబుఠే
వ వరగజంబుమాడ్కిఁ గ్రతువాటిగతిన్ బురితోట లొప్పగున్.

254

[6]బొడ్డపాటి పేరయ్య - శంకరవిజయము

ఉ.

ఆమని టెంకిపట్లు మలయానిలు నిత్యవిహారసీమముల్
కాముని పాలెముల్ శుకపికంబుల జీతపుటూళ్ళు కామినీ
కాముకవిశ్రమంబులకుఁ [7]గట్టని [8]యోవరు లా పురాంగనా
స్తోమమునందు నెందు నెలతోఁటలు శైలశిలోన్నతస్థితిన్.

255

సరోవరము

సంకుసాల సింగయ్య - కవికర్ణరసాయనము [1-24]

చ.

అలికులకుంతలంబులు రథాంగకులంబులు పద్మవక్త్రముల్
గలరవపద్మినుల్ కడువికాసముతోఁ దమయందు సక్తలై
యలర విహారవేళఁ దమునంటిన కాంతల మేని కస్తురిన్
జులకన సోడుముట్టు సరసుల్ సరసుల్ వలె నొప్పు నప్పురిన్.

256
  1. క.నగ
  2. క.నైవేద్య
  3. క.నిట్టలంబగు
  4. క.పువ్వుల
  5. ట.బొంది
  6. జొన్నపాటి
  7. క.గల్లని
  8. క.యోర్య+, ట.యోర్వకు