[1]పణిదవు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము
ఉ. |
పొంకపుగుబ్బలుం బునుఁగుఁ[2]బూతలుఁ దుమ్మెదకప్పుమేనులున్
జంకెనచూపులున్ జఘనసైకతసీమలఁ బారుటాకులున్
మంకెనచాయ [3]మోవులును మానితహస్తధనుశ్శరంబులున్
గొంకక భిల్లకామినులకుం దగియుండు బసిండిగుబ్బలిన్.
| 243
|
ఉ. |
చెంచెత గుబ్బచన్నుఁగవ శీఘ్రతరంబుగ నంతనంత వ
ర్తించెను యౌవనో[దయ]విజృంభణ మెక్కిన నంతనంత శో
షించెను దాని నెన్నడుము జీవితనాథుఁడు వాని విల్లునున్
జెంచుల రాజులున్ [4]సవతి చేడియపిండును పక్కణంబునన్.
| 244
|
బొడ్డపాటి పేరయ - శంకరవిజయము
చ. |
అడరి సరోజరాగమణు లామిషఖండము లంచుఁ గఱ్ఱకు
ట్లొడికము సేయు వేడుకల నుజ్జ్వలసన్మణు లేర్చి నిప్పులం
దిడియును భల్లుకవ్రజనిరీక్షణముల్ గని దివ్వె లంచుఁ దేఁ
డడవుదు రొయ్య మౌగ్ధ్యమునఁ దద్గిరిసీమఁ గిరాతబాలికల్.
| 245
|
ఉపవనము
తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము
చ. |
సరసులపొందు[5]లం దొసఁగఁజాలి బహూన్నతచారుశాఖలన్
బెరిఁగి మహాద్విజావనమె [6]పేర్చి నిజాయతిగాఁ [7]దనర్చి ని
ర్భరజనతాపసంహరణపాత్రము లయ్యు మహీజవాటికల్
పురి వెలి నిల్చె [8]మేటియు నపూజ్యుఁ డగున్ మధుపానుకూలతన్.
| 246
|
పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత
చ. |
ఇతవులయందు [నెల్లఁ] దన యేపును సొంపును మవ్వముం జిర
స్థితిఁ జెలువొంద నోచి మరుసేనలకున్ బెనుప్రాపుగ న్సమా
తతముగఁ బెక్కునిల్కడలు దాల్చిన మాధవలక్ష్మియో యనన్
సతతము నొప్పెఁ జూడఁ బురనందనసుందరపాదపావళుల్.
| 247
|
చ. |
లలితలతాంతపల్లవశలాటుఫలాంకితభూజరాజసం
కులబహుచిత్రవర్ణపటకూటకుటీరపటంబుగా లతా
|
|
- ↑ పణెదవు
- ↑ క.బూతయు
- ↑ ట.మోములును
- ↑ ట.సగమ
- ↑ ట.గల్దనఁగ
- ↑ ట.పేర్మి
- ↑ క.లడర్చి
- ↑ క.మేటి యనఁ బూజ్యుఁ డగున్