పుణ్యసతులు
చెదలువాడ ఎఱ్ఱాప్రెగడ - నరసింహపురాణము [1-49]
ఉ. |
శ్రీసతికి న్మురారికిని సేసలు వెట్టిన పెండ్లిపెద్ద ల
బ్జాననుఁ డంబుజోదరమునందు జనించిననాఁడు చేరి యు
ల్లాసము పల్లవింప నుపలాలన సేసిన యమ్మ లెల్ల సం
తోషమునన్ ముకుందు సయిదోడులు తత్పురిపుణ్యభామినుల్.
| 238
|
ఏర్చూరి సింగయ్య - కువలయాశ్వచరిత
క. |
నిరుపమధర్మస్థితిచే
వరపాతివ్రత్యనియతివైభవమున న
ప్పురిపుణ్యకాంత లమరిరి
గిరిఁ దత్పురివాణు లెల్ల కీర్తిత[1]గరిమన్.
| 239
|
శబరకాంతలు
ఉ. |
మీఱిన భద్రనాగముల మీఁదికి దాఁటి తదీయకుంభముల్
చూరలు వట్టు కేసరికిశోరనఖావళినుండి రాలి సొం
పారిన మౌక్తికంబులు ప్రియంబున నేరి కిరాతబాలికల్
గీరనగింజ లాడుదురు కేళిఁ దలిర్పఁగఁ బక్కణంబులన్.
| 240
|
క. |
గిటగిటనగు నెన్నడుములుఁ
బుటపుట నగు చన్నుఁగవలుఁ బున్నమనెలతోఁ
[2]జిటపొట లాడెడి మొగములుఁ
గటితటముల యొప్పు శబరికాంతల కొప్పున్.
| 241
|
ముక్కుతిమ్మయ - పారిజాతాపహరణము [2-87]
ఉ. |
వంచనఁ బొంచి చేరువకు వచ్చిన చంద్రుని జింక నేసి హ
ర్షించియుఁ దత్సుధారసనిషేచనచే నది చావ[3]కున్కి వీ
క్షించుచు నేటు దప్పెనని చే విలునమ్ములుఁ బాఱవైచి ల
జ్జించి చరింపుచుండుదురు చెంచెత లగ్గిరిసానుభూములన్.
| 242
|
- ↑ ట.గతులన్
- ↑ ట.జిటచిట
- ↑ క.కుంట